English   

గీతాగోవిందం.. విజ‌య్ మారిపోయాడు..!

geethagovindam
2018-07-23 13:01:30

అర్జున్ రెడ్డితో ఒక్క‌సారిగా అంద‌రికీ హాట్ ఫేవ‌రేట్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న సినిమాలు.. ఈయ‌న స్టైల్స్ అన్నీ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం విజ‌య్ సినిమాల‌పై బాగానే ఆరా తీస్తున్నారు కూడా. ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో.. ముందు గీత గోవిందం విడుద‌ల కానుంది. ఇంకేం కావాలి పాట త‌ర్వాత ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. దానికితోడు ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ తో అంచ‌నాలు మ‌రో స్థాయికి వెళ్లిపోయాయి. టీజ‌ర్ అంటే ఏదో అలా అలా కాకుండా చాలా కొత్త‌గా ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్.

ముందు పాత జ‌మానా నుంచి మొద‌లుపెట్టి.. ఇప్ప‌టి కాలానికి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. హీరోయిన్ ర‌ష్మిక‌తో విజ‌య్ స‌ర‌సాలు అదిరిపోయాయి. గీతాఆర్ట్స్ నిర్మాణం కావ‌డంతో సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. పైగా శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత ప‌రుశురామ్ చేస్తోన్న సినిమా.. ఛ‌లో బ్యూటీ ర‌ష్మిక హీరోయిన్.. ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. మొత్తానికి టీజ‌ర్ తో గీత‌గోవిందం రేంజ్ మ‌రింత పెరిగిపోయింది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

More Related Stories