English   

గీత గోవిందం ప్రాఫిట్ బాగానే వచ్చింది.

Geetha Govindam Worldwide Box Office Collections
2018-08-21 16:00:06

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యాజిక్ కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఈ ఇద్దరూ నటించిన గీత గోవిందం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్, బన్నీవాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. ఓ చిన్న పాయింట్ చుట్టూ సున్నితమైన భావోద్వేగాల నడుమ అల్లుకున్న ఈ కథ, కథనం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు రెండు సినిమాలతోనే విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. మొత్తంగా కేవలం ఐదు రోజుల్లోనే గీత గోవిందం డబుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. ఏకంగా 53కోట్ల షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అలాగే ఇంకా అన్ని థియేటర్స్ లోనూ కలెక్షన్స్ స్టడీగా ఉండటం విశేషం.

గీత గోవిందం ఐదు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి. 

నైజాం        : 8కోట్ల 70లక్షలు 
వైజాగ్        : 2కోట్ల 18లక్షలు
ఈస్ట్           : 1కోటి 75లక్షలు
వెస్ట్            : 1కోటి 39లక్షలు 
కృష్ణా          : 1కోటి 66లక్షలు
గుంటూర్    : 1కోటి 74లక్షలు 
నెల్లూర్       : 0.66 లక్షలు 
(ఆంధ్ర       : 9కోట్ల 40లక్షలు)
సీడెడ్         : 3కోట్ల 35లక్షలు

నైజాం, ఏపి కలిపి టోటల్     : 21కోట్ల 45 లక్షలు షేర్
---------------------------------------------------------
కర్ణాటక                   : 2 కోట్ల 30లక్షలు
తమిళనాడు           : 0.60 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.30 లక్షలు 

ఇండియా మొత్తం టోటల్     : 24 కోట్ల 65లక్షలు 

ఓవర్శీస్ లో 

యూఎస్ఏ                          : 5 కోట్ల 95లక్షలు
ఆస్ట్రేలియా/న్యూజీలాండ్   : 0.50 లక్షలు 
రెస్ట్ ఆఫ్ వరల్డ్                    : 0.55 లక్షలు 

సో.. ఇండియా, వాల్డ్ వైడ్ గా కలిపి మొత్తం 31 కోట్ల65 లక్షల షేర్ తో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ.. 
అయితే నిజానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మింది కేవలం 15కోట్లకు మాత్రమే. ఆ మార్క్ ను మొదటి రోజే టచ్ చేసిన గీత గోవిందం ఇప్పుడు ఎంటైర్ ట్రేడ్ ను సర్ ప్రైజ్ చేస్తూ డబుల్ ప్రాఫిట్స్ ను తెచ్చుకోవడమే కాదు... యాభై కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది.

More Related Stories