English   

మళ్లీ జెంటిల్మన్ తోనే అంటోన్న మోహనకృష్ణ

indraganti mohankrishna
2018-07-10 15:40:55

కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నాని కెరీర్ లో సాధారణ లవ్ స్టోరీస్ తో సాగిపోతోన్న టైమ్ లో అతన్ని సడెన్ గా జెంటిల్మన్ లా మార్చి మరోసారి అతని నేచురల్ పర్ఫార్మెన్స్ ను చూపించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. నిజానికి జెంటిల్మన్ కు ముందు తర్వాత నాని అంత సీరియస్ సబ్జెక్ట్స్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే కెరీర్ లోనే కాస్త విలనీ టచ్ ఉన్న పాత్ర చేశాడందులో. అందుకే అంత బాగా పేలింది. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా జెంటిల్మన్ తర్వాత ఫెయిల్యూర్స్ లేకుండా దూసుకుపోతున్నాడు. అమీతుమీతో అద్భుతంగా నవ్వించి మంచి హిట్ కొట్టాడు.

లేటెస్ట్ గా సమ్మోహనంతో మరోసారి సమ్మోహన పరిచాడు. సమ్మోహనం తర్వాత ఎవరితో చేస్తున్నాడు అనే ప్రశ్నలకు ఈ వార్త ఫుల్ స్టాప్ పెట్టేలానే ఉంది. మరోవైపు నాని, నాగార్జునతో కలిసి దేవదాస్ అనే సినిమా చేస్తున్నాడు. తర్వాత మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అయితే అవేవీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఇటు మోహనృష్ణ కూడా కొత్త కథ రాసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటాడు. ఈ లోగా నాని ఓ సినిమా పూర్తి చేయొచ్చు. ఒకవేళ ఈ దర్శకుడి కథే నచ్చితే ఆ రెండో ప్రాజెక్ట్ ను హోల్డ్ లోపెట్టే అవకాశమూ లేకపోలేదు.  అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈమధ్య నాని నుంచి మరీ రొటీన్ సినిమాలే వస్తున్నాయనే విమర్శలు పెరిగాయి. తన ఇమేజ్ తో ఈ మధ్య రెండు మూడు సినిమాలు నడిచాయి.. కానీ నిజానికి ఆ సినిమాలకు రివ్యూస్ కూడా ఏమంత బాలేదు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సో.. ఈ జెంటిల్మెన్ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. అంటే ఏ జానర్ లో ఉంటుందా అనేది చూడాలి. 

More Related Stories