English   

నటుడు ఆర్య పై ప్రధానికి ఫిర్యాదు చేసిన జర్మన్ యువతి

 german woman
2021-02-20 11:12:59

తమిళ హీరో ఆర్య తనను మోసం చేసారని ఓ జర్మన్ యువతి ప్రధాని, రాష్ట్రపతి లకు లేఖ రాసింది. తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి రూ.80 లక్షలు తీసుకుని మోసం చేసాడని పేర్కొంది. తనకు ఆర్య ఇస్మాయిల్ అనే వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. ఇద్దరు కలిసి తనను మోసం చేసారని వాపోయింది. ఆర్య తల్లి జమీల సమక్షంలోనే అతడికి డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. లాక్ డౌన్ సమయం లో ఆర్థిక ఇబ్బందుకు ఉన్నాయని అందుకే డబ్బు సహాయం చేయాలని కోరారని వెల్లదించింది. ఆర్య తన తో పాటు మరి కొందరిని కూడా ఇలా మోసం చేశాడని పేర్కొంది.

ఈ విషయంపై అనేక సార్లు పోలీసులను సంప్రదించానని..కానీ ఆర్య పలుకుబడి వల్ల ఏమీ చేయలేఖపోయానని చెప్పింది. అందుకే మీకు లేఖ రాస్తున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సదరు జర్మన్ యువతి చెన్నై లో మెడికల్ విభాగంలో పని చేస్తుందిత్యు తెలుస్తోంది. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై ఆర్య ఎలా స్పందిస్తారో చూడాలి. ఆర్య తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..అల్లు అర్జున్ హీరోగా నటించిన "వరుడు" సినిమాలో ఆర్య విలన్ గా నటించి అలరించారు. అంతే కాకుండా తమిళ్ సినిమా ఆర్య నటించిన" రాజా రాణి" సినిమా తెలుగులో డబ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

More Related Stories