English   

అబ్బో.. బాహుబలికి ప్రీక్వెలట

Baahubali-Prequel

బాహుబలి.. ఇండియన్ సినిమా రేంజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకువెళ్లిన అచ్చ తెలుగు సినిమా. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత కళాఖండానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మెస్మరైజ్ అయ్యాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. రెండు భాగాలు వచ్చిన బాహుబలి.. మొదటి పార్ట్ ను మించి రెండో భాగం కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో పార్ట్ వస్తుందని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. అందరూ మరో సీక్వెల్ ఉంటుందనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఈ మూవీకి సీక్వెల్ లేదు కానీ.. ప్రీక్వెల్ ఉంటుందని తేల్చారు నిర్మాత శోభు యార్లగడ్డ. అవును ఈ మూవీకి ప్రీక్వెల్ ఉంటుందని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఈ ప్రీక్వెల్ కు మూడేళ్ల టైమ్ తీసుకుంటామని, ఇప్పుడు వేసిన మహిష్మాతి సెట్ అలాగే ఉంది.. ఇంకా మరికొన్ని సెట్స్ వేసి ఈ చిత్రీకరణ పూర్తి చేస్తాం అని చెప్పాడు. 

నిజానికి ఈ సినిమాకు సంబంధించి అంతా సడెన్ గానే ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా శివగామి, కట్టప్ప పాత్రలు. అందుకే ఈ రెండు క్యారెక్టర్స్ నే మెయిన్ సెంట్రిక్ గా తీసుకుని ఈ ప్రీక్వెల్ ఉంటుందని చెప్పాడు. అంటే శివగామి బాల్యం ఎలాంటిది, ఆమె ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతి కావడానికి మధ్య సాగిన జర్నీ మొత్తంఈ ప్రీక్వెల్ లో ఉంటుందట. అలాగే కట్టప్ప ఎవరు.. అతను ఎందుకు బానిసలా మారాడు అనే కథ కూడా ఉంటుందని చెప్పాడు. ఇక ఈ కథకు మూలం ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే నవల. దీన్ని కూడా ఈ నిర్మాతలే గతంలో విడుదల చేశారు. 
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. 
 
ఈ ప్రీక్వెల్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆన్ లైన్ సిరీస్ లుగా విడుదల చేయాలనుకుంటున్నారట. మొత్తం 192దేశాలకు ఒకేసారి లైవ్ వెళ్లేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఏమైనా వచ్చినదానితో హ్యాపీగా ఉండక మళ్లీ రాజమౌళి పేరు చెడగొట్టడం ఎందుకు. మనకు సీక్వెల్సే పెద్దగా వర్కువుట్ కాలేదు. ఇక ప్రీక్వెల్ అవుతుందా..? 
 

More Related Stories