English   

ఘాజీ.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా..!

Ghazi-National-film
2018-04-13 14:44:00

ఇన్నాళ్లూ బాహుబ‌లిని మాత్ర‌మే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అనేవాళ్లు కానీ ఈ లిస్ట్ లో తాను కూడా ఉన్నాన‌ని చెబుతుంది ఘాజీ సినిమా. ఆరు పాట‌లు.. నాలుగు ఫైట్లు.. మూడు కామెడీ సీన్లు.. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి. కానీ మ‌న‌సుకు హ‌త్తుకునే సినిమాలు మాత్రం అప్పుడ‌ప్పుడే వ‌స్తుంటాయి. గ‌తేడాది రానా చేసిన ఘాజీ కూడా ఇలాటి ప్ర‌య‌త్న‌మే. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కింది ఘాజీ. కొత్త ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన‌ ఈ చిత్రంపై అన్ని ఇండ‌స్ట్రీల్లో మంచి విజ‌యం సాధించింది. ఫిబ్ర‌వ‌రి 17న 2017న వ‌చ్చింది ఈ చిత్రం. రానా, ఓంపురి, అతుల్ కుల‌క‌ర్ణి, కేకే మీన‌న్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేసారు. ఈ సినిమాకు ఇప్పుడు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. 

ఉత్త‌మ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకుంది ఘాజీ. లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ అర్జున్ వ‌ర్మ‌గా ఘాజీ అటాక్ లో న‌టించాడు రానా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అప్ప‌ట్లో పాకిస్థాన్ మ‌న దేశంపైకి ఘాజీ అనే జ‌లాంత‌ర్గామిని ప్ర‌యోగించింది. త‌న ప్రాణాల‌కు తెగించి విశాఖ‌ప‌ట్నాన్ని కాపాడారు అప్ప‌ట్లో ఈ ఆప‌రేష‌న్ లో పాల్గొన్న సైనికులు, నేవీ ఆఫీస‌ర్లు. ఎవ‌రికీ తెలియ‌ని ఈ క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించాడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ మ‌ధ్య రియాలిటీ స్టోరీస్ అన్నీ బాగానే క్లిక్ అయ్యాయి. ఘాజీకి కూడా ఇదే జ‌రిగింది. మొత్తానికి ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా కాదు ఇండియ‌న్ సినిమాగా మారిపోయింది ఘాజీ.

More Related Stories