English   

ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్ !

 Prabhas
2019-08-11 12:42:33

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. అదేంటంటే సాహో' సినిమాకు తన జీవితంలో రెండేళ్లు ఇవ్వాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 'బాహుబలి' కోసం జీవితంలో ఐదేళ్లు ఇచ్చేశాననీ అందుకే కానీ 'సాహో' కోసం మరో రెండేళ్లు ఇవ్వద్దని అనుకున్నాని కానీ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్న నిర్మాతల కోసం ఆ మాత్రం టైం కేటాయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మరోపక్క జిల్ రాధాకృష్ణ సినిమా ప్రారంభమైందనీ దాదాపు 20 రోజుల షూటింగ్‌ జరిగాక సాహొ కోసం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇకనుండి అయినా ఏడాదికి కనీసం రెండు సినిమాలు తీయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇది ఆయన అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

More Related Stories