English   

గూఢ‌చారి రివ్యూ

Goodachari-Review
2018-08-03 12:53:30

క్ష‌ణం లాంటి అద్భుత‌మైన సినిమా పూర్తిగా క‌నిపించ‌డం మానేసాడు అడ‌విశేష్. మ‌ళ్లీ అప్పుడు మాయ‌మై ఇప్పుడు వ‌చ్చాడు. గూఢ‌చారి అంటూ స్పై థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రి ఇది ఎలా ఉంది..? ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా..?

క‌థ‌: అర్జున్ కుమార్ అలియాస్ గోపీ(అడ‌విశేష్) ఇండియ‌న్ స్పై. తండ్రి ర‌ఘువీర్ దేశం కోసం ప్రాణం ఇచ్చిన సోల్జ‌ర్. అత‌డి అడుగు జాడ‌ల్లోనే కొడుకు కూడా న‌డ‌వాలి అనుకుంటాడు. కానీ గోపీని టెర్రరిస్టులు చంపేస్తారేమో అని అత‌డు చ‌నిపోయాడ‌ని అంద‌ర్నీ న‌మ్మించి.. దూరంగా పెంచుతాడు  ర‌ఘువీర్ స్నేహితుడు స‌త్య‌(ప్ర‌కాశ్ రాజ్). కానీ సోల్జ‌ర్ కావాల‌ని చిన్న‌ప్ప‌ట్నుంచీ క‌ల‌లు కంటూ చివ‌రికి సాధిస్తాడు అర్జున్. కానీ వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా అర్జున్ పైనే టెర్రరిస్ట్ గా ముద్ర ప‌డుతుంది. అస‌లు ఈయ‌న ఎందుకు టెర్ర‌రిస్ట్ గా మారాడు..? మ‌ధ్య‌లో టెర్ర‌రిస్ట్ రాణా(జ‌గ‌ప‌తిబాబు) ఎందుకు వ‌చ్చాడు అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడి క‌థ‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు గూఢ‌చారి కూడా ఇలా వ‌చ్చిందే. కానీ ఎన్నిసార్లు వ‌చ్చినా చెప్పే ర‌కంగా చెబితే క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు అడ‌విశేష్ ఇదే చేసాడు. రెండేళ్ల‌కు పైగా కూర్చుని క్ష‌ణం త‌ర్వాత ఈ క‌థ రాసుకున్నాడు శేష్. ఆ క‌ష్టం స్క్రీన్ పై క‌నిపిస్తుంది కూడా. ఎక్క‌డా చిన్న లాజిక్ కూడా మిస్ కాకుండా ఈ క‌థ సిద్ధం చేసాడు. స్పై అంటే నేరుగా టెర్ర‌రిస్ట్ ల‌ను చంప‌డం మొద‌లుపెట్ట‌కుండా.. అస‌లు స్పై అంటే ఏంటి.. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా డీటైల్డ్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా అదే ఉంటుంది. దాంతో పాటే హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ కూడా ప‌ర్లేద‌నిపిస్తుంది. అయితే క‌థ‌కు అడ్డు ప‌డుతుందేమో అనుకునే లోపు ఆ క‌థ ముగించేసాడు ద‌ర్శ‌కుడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ సినిమాకు మేజ‌ర్ హైలైట్. ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అస‌లు ఒక్క క్లూ కూడా లేకుండా ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌డం.. ఆ క్ర‌మంలోనే ఒక్కో వివ‌రం క‌నుక్కుంటూ హీరో ముందుకెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. అయితే ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త వేగం త‌గ్గింది. కానీ చివ‌ర్లో మ‌ళ్లీ ఎమోష‌న‌ల్ ట‌చ్ తో దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ప్ర‌కాశ్ రాజ్, అడ‌విశేష్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ తో పాటు ట్రైనింగ్ పీరియ‌డ్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. మ‌రీ ముఖ్యంగా యాక్ష‌న్ సీక్వెన్సులు మ‌రో స్థాయిలో ఉన్నాయి. ఇంత త‌క్కువ బ‌డ్జెట్ తో ఇంత క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వ‌డం నిజంగా అద్భుత‌మే. ఓవ‌రాల్ గా ఈ గూఢ‌చారి థ్రిల్ బాగానే చేస్తాడు. 

న‌టీన‌టులు: అడ‌విశేష్ బాగా న‌టించాడు. త‌ను క‌మ‌ర్షియ‌ల్ హీరో అవ్వాల‌నుకోవ‌డం లేదు.. క‌థ‌లున్న సినిమాల‌కు హీరోగా అవుదాం అనుకుంటున్నాడ‌ని క్ష‌ణంతో అర్థ‌మైంది.. ఇప్పుడు నిజ‌మైంది. రొటీన్ సినిమాల కంటే ఇలా డిఫెరెంట్ ప్ర‌య‌త్నాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. అడ‌విశేష్ త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్ కు అంత మంచి పాత్ర ప‌డింది. జ‌గ‌ప‌తిబాబు బాగానే స‌ర్ ప్రైజ్ చేసాడు. శోభిత ధూళిపాల ఉన్నంత సేపు బాగుంది. అందం ప్ల‌స్ అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. సుప్రియ 20 ఏళ్ల త‌ర్వాత న‌టించినా ఇప్ప‌టికీ అదే ఈజ్ చూపించింది. రా ఏజెంట్ గా చాలా బాగా న‌టించింది. వెన్నెల కిషోర్ కూడా కామెడీ నుంచి కాస్త స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు.

టెక్నిక‌ల్ టీం: గూఢ‌చారికి శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల ఆర్ఆర్ ప్రాణం. పాట‌ల కంటే కూడా ఇలాంటి సినిమాల‌కు కావాల్సింది ఆర్ఆర్. అది అదిరిపోయింది. ఇక యాక్ష‌న్ సీక్వెన్స్ లు కూడా చాలా బాగున్నాయి. స్టంట్ మాస్ట‌ర్ ప్రాణం పెట్టాడు. ఎడిటింగ్ బాగుంది. ఎక్క‌డా పెద్ద‌గా బోర్ కొట్ట‌లేదు. సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించినా.. పాస్ అయిపోతుంది. రైట‌ర్ గా అడ‌విశేష్ మ‌రోసారి త‌న ఇంటిలిజెన్స్ చూపించాడు. ద‌ర్శ‌కుడిగా శ‌శికిర‌ణ్ టిక్కా ప‌నితీరు బాగుంది.

చివ‌ర‌గా: గూఢచారి 116.. 2018 రిపోర్టింగ్ స‌ర్..!

రేటింగ్: 3/5

More Related Stories