English   

గూఢ‌చారి అక్క‌డ దున్నేస్తున్నాడు.. 

Goodachari-usa-collections
2018-08-07 13:14:34

ఒక్క‌సారి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది అంటే నిర్మాత‌ల‌కు పండ‌గే ఇంక‌. ఇప్పుడు గూఢ‌చారి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. అడ‌విశేష్ ఏమీ పెద్ద స్టార్ కాదు.. కానీ ఈ సినిమా ఇప్పుడు వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. ఇండియా విష‌యం ప‌క్క‌న‌బెడితే ఓవ‌ర్సీస్ లో అయితే దున్నేస్తున్నాడు ఈ గూఢ‌చారి. అక్క‌డ మూడు రోజుల్లోనే ఏకంగా 4 ల‌క్ష‌ల 10 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. హాఫ్ మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తున్నాడు గూఢ‌చారి. ప‌ట్టుస‌డ‌ల‌ని స్క్రీన్ ప్లే.. అడ‌విశేష్ అద్భుత‌మైన రైటింగ్ కు తోడు న‌ట‌న‌.. ప్ర‌కాశ్ రాజ్, శోభిత‌, సుప్రియ‌, జేబీ అప్పియ‌రెన్స్ కూడా ఈ చిత్రానికి మేజ‌ర్ హైలైట్. అన్నింటికీ మించి యాక్ష‌న్ సీక్వెన్సులు పిచ్చెక్కిస్తున్నాయి. 

హాలీవుడ్ సినిమాల రేంజ్ లో దుమ్ము దులిపేస్తుండ‌టంతో గూఢ‌చారికి ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. శ్రీ‌నివాస క‌ళ్యాణం వ‌చ్చేవ‌ర‌కు మ‌రో సినిమా లేదు కాబ‌ట్టి క‌చ్చితంగా ఈ చిత్రం అక్క‌డ ఫుల్ ర‌న్ లో 7 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. మ‌రోవైపు ఇండియాలో కూడా గూఢ‌చారికి తిరుగులేదు. ఈ చిత్రం ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల మార్క్ అందుకుంది. మూడు రోజుల్లో ఓవ‌రాల్ గా 4 కోట్ల 60 ల‌క్ష‌ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. క్ష‌ణం త‌ర్వాత మ‌రోసారి అడ‌విశేష్ కు అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది ఈ గూఢ‌చారి. 

More Related Stories