English   

దేవిశ్రీని వద్దని గోపీ సుందర్ కే...రీజన్ అదేనట

devi
2019-04-25 21:26:58

అఖిల్ నాలుగవ దండయాత్ర కి రంగం సిద్దం అవుతోంది అదే నండీ నాలుగో సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా వచ్చేనెలలో సెట్స్ మీదకి తీసుకెళ్ళేలా ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా చేస్తున్నారు. అయితే ముందు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత  మళ్ళీ తమన్ పేరు లైన్ లోకి వచ్చింది. అయితే వీరిద్దరినీ పక్కన పెట్టేసి ఫైనల్ గా గోపీసుందర్ ను తీసుకున్నారట. అయితే నిజానికి దేవిశ్రీ,, లేదా తమన్ లతో చేయడానికి అందరూ ఉత్సాహం చూపినా సినిమా బడ్జెట్ ను సాధ్యమైనంత తగ్గించాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్ గోపీసుందర్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇటీవల గోపీసుందర్ పాటలు అందించిన మజిలీ రిలీజ్ అయింది, ఆ సినిమా పాటలే కాక ఆయన ట్రాక్ రికార్డ్ నచ్చడం, తక్కువ ఖర్చుతో అయిపోవడం లాంటి కారణాల వలన ఈయన్ని ఫైనల్ చేశారట.

More Related Stories