English   

టోల్ గేట్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్

Gopi-Sundar
2018-07-17 14:59:50

మళయాలంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా హవా చేస్తోన్న గోపీ సుందర్ హీరోగా మారాడు. గోపీ తెలుగులోనూ తనదైన ముద్ర వేస్తున్నాడిప్పుడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే మళయాలంలోనూ బిజీగా ఉన్నాడు. అతని ఖాతాలో మాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ హిట్స్ ఉండటమే కాదు.. ఓ నేషనల్ అవార్డ్ కూడా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీ సుందర్.. తెలుగులో మళ్లీమళ్లీ ఇది రాని రోజు, ప్రేమమ్, భలేభలే మగాడివోవ్ వంటి విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు. కాకపోతే తెలుగులో మళయాలం స్థాయి ఇంపాక్ట్ చూపించడంలో కాస్త విఫలమవుతున్నాడు. ఇక మ్యూజిక్ మేటర్ పక్కన బెడితే ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారాడు.. గోపీసుందర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా పేరు ‘టోల్ గేట్’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను అక్కడి టాప్ హీరో దుల్కర్ సాల్మన్ విడుదల చేశాడు. ఈ చిత్రానికి హరికృష్ణన్ దర్శకుడు. మరి తమిళ్ లో ఇలాగే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన విజయ్ ఆంటోనీ హీరోగా మంచి సక్సెస్ సాధించాడు. అతన్లానే గోపీ కూడా హీరోగా సక్సెస్ అవుతాడా అనేది చూడాలి. ఇక గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన తెలుగు సినిమా గీత గోవిందం విడుదలకు సిద్ధంగా ఉంది. 

More Related Stories