English   

గోపీచంద్ గట్టి పంతం పట్టాడు

Gopichand got a stiff line

యాంగ్రీ యంగ్ మేన్ గోపీచంద్ ఈ సారి గట్టి పంతం పట్టినట్టు కనిపిస్తోంది. వరుసగా వస్తోన్న ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న గోపీచంద్.. ఈ సారి ఖచ్చితంగా ఓ గట్టి హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడితో కలిసి పంతం పట్టాడు. ఇవాళ పంతం టీజర్ విడుదలైంది. చూస్తోంటే గోపీచంద్ ఈజ్ బ్యాక్ అనేలా ఉందీ టీజర్. అన్నట్టు ఈ సినిమా గోపీచంద్ కు కెరీర్ లో 25వ సినిమా. ఒకరకంగా మైల్ స్టోన్ లాంటి సినిమా. ఆ మైల్ స్టోన్ ను మెమరబుల్ గా మలచుకుంటే చాలు.. ఒకేసారి రెండు పనులైపోతాయ్.

పంతం టీజర్ లో చాలా విషయాలు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చిన్న టీజర్ లోనే గోపీచంద్ కూడా చాలా వేరియేషన్స్ చూపించాడు. ఇక మన తెలుగు సినిమాల్లో కోర్ట్ సీన్స్ ఎప్పుడూ హైలెట్ అవుతుంటాయి. అలాగే ఈసినిమాలోనూ ఓ కోర్ట్ సీన్ ఉంది. అది కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. అటు కామెడీ కూడా బానే పండించినట్టు తెలుస్తోంది. 

విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఈసినిమాలో గోపీచంద్ ఓ మల్టీమిలియనీర్ కొడుకుగా నటిస్తున్నాడు. వీళ్లు లండన్ లో ఉంటారు. సడెన్ గా ఓ రోజు ఇండియాకు వస్తాడు గోపీచంద్. అక్కడి నుంచి రకరకాల దొంగతనాలు చేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అతనెందుకు అలా చేస్తున్నాడు. మల్టీ మిలియనీర్ దొంగతనాలు చేయడం వెనక ఉన్న సీక్రెట్ ఏంటీ అనేది కథ. మొత్తంగా పంతం కాస్త పవర్ ఫుల్ గానే ఉంది. ఓ కారణం కోసం పట్టిన ఈ పంతం గోపీచంద్ ను మళ్లీ నిలబెడుతుందేమో చూడాలి. 

More Related Stories