English   

పంతం నెగ్గ‌లేదు.. ఓడ‌లేదు..!

Gopichand-Pantham
2018-07-08 12:47:26

పంతం విడుద‌లై అప్పుడే మూడు రోజులు అవుతుంది. ఈ చిత్రం చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల రియాక్ష‌న్స్ మాత్రం ఓ ప‌ట్టాల అందడం లేదు. ఏదైనా సినిమా విడుద‌లైతే.. బాగుంది బాలేదు అంటారు. కానీ ఈ చిత్రానికి మాత్రం అటూ ఇటూ ఎటూ కాకుండా ఉంది టాక్. కొంద‌రు బాగుందంటున్నారు మ‌రికొంద‌రు ఏముంది అంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు వాడేసిన రాబిన్ హుడ్ క‌థ‌నే మ‌రోసారి తీసి చూపించాడు కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి. గోపీచంద్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లుగా క‌థ‌ను సిద్ధం చేసుకుని.. దానికి త‌గ్గ‌ట్లు సీన్స్ అల్లేసుకుని ప్రేక్ష‌కుల ముందుకు పంతం అంటూ వ‌చ్చేసాడు. చివ‌రి 15 నిమిషాల్లో సందేశం ఇవ్వ‌డం కోసం సినిమా అంతా ఏదోలా న‌డిపించాలనే త‌ప‌న‌తో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తొలిరోజు 3 కోట్ల‌కు పైగా షేర్ తెచ్చిన పంతం.. రెండు మూడు రోజుల్లో కూడా మంచి వ‌సూళ్లు తీసుకొచ్చింది. మ‌రి ఈ లెక్క‌న పంతం నెగ్గింది అనుకోవాలా అంటే వీకెండ్ అయిపోయిన త‌ర్వాత ఎలా ఉంటుంది ప‌రిస్థితి అనేది ఆలోచించుకోవాల్సిన ప‌ని ఉంది. 

మ‌ధ్య‌లో కొన్ని సీన్లు అద్భుతంగా రాసుకున్నా.. ఆ సీన్స్ తాలూకు గ్రిప్ కంటిన్యూ చేయ‌లేక త‌న అనుభ‌వ రాహిత్యాన్ని చూపించాడు ద‌ర్శ‌కుడు చ‌క్రి. అయితే పంతం సినిమా మ‌రీ తీసిపారేయాల్సిన సినిమా అయితే కాదు. గోపీ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బెట‌ర్ మూవీ. త‌న 25వ సినిమా అని తెలిసే సోష‌ల్ కాజ్ ఉన్న సినిమా చేసాడు ఈ హీరో. ఇదే సినిమా లౌక్యం త‌ర్వాత కానీ వ‌చ్చుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. అప్పుడు క‌చ్చితంగా హిట్ కొట్టుండేది పంతం. కానీ ఇప్పుడు గోపీ సినిమాకు ఓపెనింగ్స్ రావ‌డ‌మే క‌ష్టంగా ఉంది.. అలాంటిది రొటీన్ సినిమానే అని తెలిసిన త‌ర్వాత కూడా థియేట‌ర్ కు ప్రేక్ష‌కుడు వ‌స్తాడా అనేది అస‌లు అనుమానం. ఇప్ప‌టికైతే పంతం గ‌ట్టిగానే ప‌ట్టాడు. మ‌రి అది ఎలా ఉంటుందో చూడాలిక‌..!

More Related Stories