English   

 పంతం ఫ‌స్ట్ టాక్ ఏంటి..? 

Gopichand-pantham
2018-07-05 08:02:29

గోప‌చంద్ పంతం మంచి అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఎప్ప‌ట్లాగే మ‌రో రొటీన్ సినిమాతోనే వ‌చ్చాడు ఈ యాక్ష‌న్ హీరో. అయితే పంతం రొటీన్ గా ఉన్నా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా సోష‌ల్ ఇష్యూను తీసుకుని కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి బాగా డీల్ చేసాడంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్ అంతా ఏదో కామెడీతో అలా అలా న‌డిచిపోయినా.. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ నుంచి సినిమా నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్తుంద‌ని.. క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ ఎక్క‌డా ఆగ‌కుండా ప‌రుగులు పెట్టించాడ‌ని తెలుస్తుంది. క‌చ్చితంగా ఈ చిత్రం గోపీచంద్ గ‌త సినిమాల కంటే బెట‌ర్ గానే ఉందంటున్నారు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు. 25వ సినిమా ఏదో రొటీన్ గా ఉండ‌కుండా కాస్త సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ తీసుకోవ‌డం గోపీచంద్ కు క‌లిసొచ్చింది. త‌న‌కున్న మాస్ ఇమేజ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌చ్చింతంగా థియేట‌ర్స్ కు ర‌ప్పిస్తాడంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం కాస్త క‌ష్ట‌ప‌డితే సినిమా గాడిన ప‌డుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ఫ‌స్ట్ టాక్ తో గోపీచంద్ ఏం చేస్తాడో..?

More Related Stories