English   

గోపీచంద్ పంతం సెన్సార్ టాక్..!!

pantham movie -1

యాంగ్రీయంగ్ మేన్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘పంతం’. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. చక్రవర్తి అనే కొత్త కుర్రాడు దర్శకుడు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న పంతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి పంతం కు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అలాగే సినిమా చూసిన సభ్యులు కూడా పంతం పై ప్రశంసలు కురిపించినట్టు టాక్. గోపీచంద్ కు ఇది 25వ సినిమా. అందుకే మెమరబుల్ గా ఉండేలా ప్రయత్నం చేశారు. ఆప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకం సెన్సార్ టాక్ తర్వాత తెలిసిందంటున్నారు. 

ఇక జూలై 5న విడుదల కాబోతోన్న పంతంలో నేటి సోషల్ ఇష్యూస్ ను చాలా వరకూ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ట్రైలర్ లో చూపించిన డైలాగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు ఆడియో కూడా ఆకట్టుకునేలా ఉండటంతో పంతం విజయంపై ఎంటైర్ టీమ్ పూర్తి నమ్మకంతో ఉంది. మల్టీ మిలియనీర్ అయిన హీరో విదేశాల నుంచి ఇండియాకు వస్తాడు. ఇక్కడ విచిత్రమైన దొంగతనాలు చేస్తూ.. అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాల అటెన్షన్ ను డ్రా చేస్తాడు. మరి అతను ఇలాంటి దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనేది కథ అంటున్నారు. మరి ఈ సినిమా గోపీచంద్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories