English   

గోపీచంద్ పంతంకు అంతం లేదా..? 

gopichand-pantham

అస‌లే ఇప్పుడు టైమ్ బాగోలేదు. వ‌ర‌స‌గా వ‌చ్చిన సినిమాలు వ‌చ్చిన‌ట్లు చాప చుట్టేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా పంతం. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎదురెళ్లి వాళ్లు చేస్తోన్న అన్యాయాల‌పై పోరాడే కుర్రాడిగా గోపీచంద్ న‌టిస్తున్నాడు. ఓ ర‌కంగా ఇది స‌మాజానికి సందేశ‌మే. కానీ ఈ టైమ్ లో ఇది అవ‌స‌ర‌మా అంటున్నారు ప్రేక్ష‌కులు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఆర్ఎఫ్ సీలో క్లైమాక్స్ పోర్ష‌న్ ను షూట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనూ లండ‌న్ లో పాట చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నారు. మెహ్రీన్ ఇందులో హీరోయిన్. ఈ చిత్రంపై గోపీచంద్ ఆశ‌లు భారీగానే ఉన్నాయి. 

గ‌తేడాది ఈయ‌న చేసిన ఆక్సీజ‌న్ లో ఉన్న‌ది  మొత్తం సందేశ‌మే. అందులో సిగరెట్లు తాగ‌కండి అనే సందేశాన్ని ఇచ్చాడు. కానీ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. ఇప్పుడు మ‌రోసారి పంతంలో సందేశం సిద్ధం చేస్తున్నాడు గోపీచంద్. క‌థ‌లు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా టైటిల్స్ మాత్రం న‌చ్చాలి. అందులో ఆయ‌న‌కు సున్నా క‌నిపిస్తే ప‌డిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు యాక్ష‌న్ హీరో. ఈయ‌న త‌న సినిమాకు పంథం అనే టైటిల్ పెట్టుకుంటున్నాడు ఈ సారి. అస‌లు జీరోకు గోపీచంద్ కు చాలా స‌న్నిహిత సంబంధాలున్నాయి. కెరీర్ మొద‌ట్లో జ‌యం, నిజం, వ‌ర్షం లాంటి సినిమాల్లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు గోపీచంద్. ఈ మూడు సినిమాల్లోనూ సున్నా టైటిల్ లో ఉంది. ఇక హీరోగా మారిన త‌ర్వాత చేసిన తొలి సినిమా య‌జ్ఞం. ఇందులోనూ సున్నా ఉంది.

ఆ త‌ర్వాత ర‌ణం.. ల‌క్ష్యం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. సాహ‌సం.. సౌఖ్యం.. లాంటి సినిమాలు చేసాడు గోపీచంద్. ఇందులో శంఖం, సౌఖ్యం త‌ప్ప అన్నీ విజ‌యాలే. దీన్నిబ‌ట్టి సున్నా గోపీచంద్ కు ఎంత‌గా క‌లిసొచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మ‌రోసారి సున్నాతో వ‌స్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. ఇది గోపీచంద్ కు 25వ సినిమా. పంతంతో రెండు సున్నాలున్నాయి. ఈ చిత్రాన్ని బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సారి రెండు సున్నాల‌తో గోపీంచంద్ పంతం ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తుందో..!

More Related Stories