English   

గోపీచంద్ వర్సెస్  తేజూ 

Gopichand-sai-dharam-tej

జూలై ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కు స్ట్రాంగ్ హీట్ పెంచుతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు హీరోలు ఫస్ట్ వీక్ ఫైట్ కు రెడీ అయ్యారు. గోపీచంద్ పంతం జూలై 5న విడుదలవుతోంది. సాయిధరమ్ తేజ్ తేజ్ ఐలవ్యూ జూలై 6న వస్తోంది. ఒక రోజు గ్యాప్ తో వస్తోన్న ఈ ఇద్దరు హీరోలకు ఇప్పుడు ఓ హిట్ ఖచ్చితంగా కావాలి. లేదంటే కెరీర్ మొత్తానికే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. 

యాంగ్రీ యంగ్ మేన్ గా కొన్నాళ్లు హల్చల్ చేసిన గోపీచంద్ తర్వాత రూట్ మార్చి లౌక్యం చూపించాలనుకున్నాడు. కానీ ఆ జర్నీ సౌఖ్యంగా కనిపించలేదు. దీంతో మళ్లీ తనరూట్ లో చేసిన గౌతమ్ నందా కూడా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ఓ సూపర్ హిట్ కోసం గట్టి పంతం పట్టాడు. ఇది గోపీచంద్ కు 25వ సినిమా. ఈ మైల్ స్టోన్ లాంటి సినిమానే తన కెరీర్ కు కొత్త పునాదిగా మార్చుకోవాలనుకుంటున్నాడు. చక్రవర్తి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన పంతంతో గోపీచంద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన పంతంతో గోపీచంద్.. మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ను ఢీ కొట్టబోతున్నాడు.. 

ఇక వరుసగా నాలుగు డిజాస్టర్స్ చూసిన సాయిధరమ్ తేజ్ కూడా రూట్ మార్చాడు. లవ్ స్టోరీస్ కు కేరాఫ్ గా చెప్పుకునే కరుణాకరన్ డైరెక్షన్ లో సినిమా చేశాడు. తేజ్ ఐలవ్యూ అంటూ వస్తోన్న ఈ సినిమాను కెఎస్ రామారావు నిర్మించాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదలైంది. కరుణారకరన్ మార్క్ ఎంటర్టైనర్ గా.. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మార్క్ స్టోరీతో వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అనపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన నటించిన తేజ్ ఐలవ్యూతో అతనూ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. మొత్తంగా ఇద్దరు ఫ్లాప్ హీరోలు కలిసి బాక్సాఫీస్ వద్ద ఒకేసారి లక్ చెక్ చేసుకోబోతున్నారు. మరి వీరిలో విజయం ఎవరిదో కానీ ఈ ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. 

More Related Stories