English   

మళ్ళీ రెడీ అయిన గోపీ 

Gopichand
2019-05-21 13:41:21

గోపీచంద్‌ హీరోగా తమిళ్ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెహరీన్, కత్రినాకి జిరాక్స్ లా ఉండే జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. దాంతో జూన్‌ మొదటివారంలో మళ్ళీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. గత కొంత కాలంగా హిట్ లేని గోపీచంద్‌, ఆయన అభిమానులు ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా అయ్యాక బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు.

More Related Stories