English   

సీటీమార్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Gopichand
2021-01-28 14:02:55

గోపిచంద్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా "సీటీమార్". ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా, దిగంగన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోపిచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. అంతే కాకుండా గోపిచంద్ ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్ గా నటిస్తుంటే...తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా నటించనుంది. సినిమాలో దిగంగన గోపిచంద్ ను ఇష్టపడే ఓ విలేజ్ అమ్మాయిగా అలరించనుంది. 

ఇక ఈ సినిమా షూటింగ్ ను లాక్ డౌన్ కు ముందు మూడు షెడ్యూల్ లలో 60శాతం పూర్తి చేశారు. మిగతా భాగాన్ని ఇప్పుడు షూట్ చేస్తున్నారు. చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న సినిమా ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గోపిచంద్ విడుదల తేదీని గోపిచంద్ రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశాడు. పోస్టర్ లో గోపిచంద్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో పెద్ద సుత్తి పట్టుకుని కోపంగా చూస్తున్నాడు. ఈ పోస్టర్ గోపిచంద్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక మొదటి సారి గోపిచంద్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఇక ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

More Related Stories