English   

గోపీచంద్ మళ్లీ సాహసం చేస్తున్నాడా..?

Chandra-Sekhar-Yeleti
2018-05-03 14:04:26

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో గోపీచంద్ ఒకడనడంలో ఏం సందేహం లేదు. కానీ మనోడికి ఈ మధ్య లక్ హిట్  చాటేసింది. దీంతో వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. మిగతా హీరోలంతా రూట్ మార్చి వెళుతుంటే తను మాత్రం వారి రూట్ లో వెళ్లి దెబ్బయిపోయాడు. లౌక్యం ఎప్పుడూ సౌఖ్యం కాదన్న విషయం తెలిసేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతం కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పేరు పంతం. టైటిల్ చివర్లో సున్నా సెంటిమెంట్ గా ఉన్న గోపీ ఈ పంతంతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే పంతంతో ఉన్నాడు. అయితే లేటెస్ట్ గా మరో హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మళ్లీ సాహసం చేస్తున్నాడు అనేదే ఆ వార్త.

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో చంద్రశేఖర్ ఏలేటి ఒకడు. ప్రతిభకు తగ్గస్థాయి విజయాలు లేకపోవడంతో అతను స్టార్ డైరెక్టర్ కాలేదు కానీ.. అందుకు కావాల్సిన అన్ని అర్హతలున్నాయి. ఏ కథనైనా కొత్తగా చెప్పడం చంద్రశేఖర్ స్టైల్. కొన్నేళ్ల క్రితం గోపీచంద్ తో ఒక్కడున్నాడు అనే సినిమా చేశాడు చంద్రశేఖర్. కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా.. చాలామందికి విపరీతంగా నచ్చిన సినిమా ఇది. ఆ తర్వాత గోపీ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మరోసారి అతనితో సాహసం చేశాడు. సాహసంతో కెరీర్ కు కొత్త ఊపిరి తెచ్చుకున్న గోపీచంద్  కొన్నాళ్లు హవా చేశాడు. బట్ ఇప్పుడు మళ్లీ కెరీర్ హిట్ తప్పింది. ఈ నేపథ్యంలో గోపీచంద్, చంద్రశేఖర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ కథ ముందు సాయిధరమ్ తేజ్ కు చెప్పాడు చందూ. కానీ తేజూ నో చెప్పాడు. దీంతో ఇదే కథను కాస్త మార్పులు చేసి గోపీకి వినిపించాడు. ఇద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. కాబట్టి గోపీ యస్ చెబితే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేం కాదు. మరి ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే వీరికిది హ్యాట్రిక్ మూవీ అవుతుందేమో చూడాలి. 

More Related Stories