English   

గోపీచంద్ పంతం నెరవేరేలానే ఉంది.. 

Pantham-Trailer
2018-06-25 12:00:30

యాంగ్రీ యంగ్ మేన్ గోపీచంద్ కెరీర్ లో ఓ మెమరబుల్ మైల్ స్టోన్ కు చేరుకున్నాడు. అదే అతని 25వ సినిమా. 25వ సినిమా అంటే ఎవరికైనా మెమరబుల్ గా మార్చుకోవాలనే ఉంటుంది. అందుకే ఈ సారి గట్టి పంతం పట్టాడు. ఓ కొత్త దర్శకుడుని నమ్మి ఈ పంతం అతని చేతిలో పెట్టాడు. ఇవాళ ఉదయం పంతం ట్రైలర్ విడుదలైంది. చూస్తోంటే గోపీచంద్ పంతం నెరవేరేలానే ఉంది.  గోపీచంద్ కు ఉన్న ఇమేజ్ కు గురించి అందరికీ తెలుసు. అతను యాంగ్రీ యంగ్ మేన్. కానీ మధ్యలో కామెడీ చేశాడు. దీంతో కెరీర్ సీరియస్ గా దెబ్బయిపోయింది. అందుకే మళ్లీ బ్యాక్ టు యాక్షన్ మూవీస్ అంటున్నాడు. ఈ నేపథ్యంలో చేసిన పంతం జూలై 5న విడుదల కాబొతోంది. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఆడియో ఫంక్షన్ లో గోపీచంద్ చెప్పినట్టు... ఇది టి కృష్ణ మార్క్ సినిమాల్లాగా కనిపిస్తోంది. కాకపోతే గోపీచంద్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయిన ఉంది. ట్రైలర్ ను బట్టి ఇది స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఉన్న సినిమా అనిపిస్తోంది.. చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించిన పంతంపై గోపీచంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేడా కొడుతున్నాయి. దీంతో ఈ పంతంతో మళ్లీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ లోనే మంచి డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి డైలాగ్ ఆలోచింపచేసేలా ఉంది. ముఖ్యంగా కోర్ట్ లో చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. పంతం కు క్యాప్షన్ ఫర్ ఏ కాస్ అని ఉంది. మరి ఆ కాజ్ ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ కాజ్ నెరవేరాలని.. అలాగే గోపీకి ఇది మంచి హిట్ గా నిలవాలని కోరుకుందాం.. 

More Related Stories