English   

GSTమూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

GST Movie Trailor launched by Thalasani Srinivas yadhav
2021-08-31 23:22:42

"తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం"GST"( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఈ చిత్రం కాన్సెప్ట్ చెప్పాకా ,చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని,చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.

దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. మా "తోలు బొమ్మల సిత్రాలు"బ్యానర్ పై నిర్మించినటువంటి "గాడ్ సైతాన్ టెక్నాలజీ " చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మంత్రి గారు టైటిల్ గురించి,మా చిత్రం గురించి, ఈ చిత్రంలో ఏ సందేశం ఇస్తున్నారని అడిగారు. మా సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నామో, ఏం సందేశం ఇస్తున్నామో చెప్పిన తర్వాత అది విని ,మంత్రి గారు ఎగ్జైట్గా ఫీలై చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నారని అభినందించినందుకు మంత్రి గారికి మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాము. ఇక కంటెంట్ విషయానికి వస్తే... అసలు ఈ సమాజంలో దేవుడు, దయ్యము, సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాము. ఎందుకంటే.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు,దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ...ఈ మూడింటిని కలకలిపి వీటిలో అసలు ఏది వాస్తవం? ఏది అబద్దం అనే విషయాన్ని మేం చెప్పబోతున్నాము.

హర్రర్ సినిమా అంటే ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా లవ్, సెంటిమెంట్ ,కామెడీ ,హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. కాలేజీ లో ఉండే ప్రతి సీన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి లవ్ సీన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి హర్రర్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి సినిమాలో ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అని చాలా సినిమాల్లో ఏదో రిలీజ్ ముందు చాలా డిఫరెంట్ గా ఉంటుందని,మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని  చెప్పినట్టుగా... మీలో ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడానికో,నేను ఆవేశంతో చెబుతున్న మాటలు కావు. వాస్తవంగా చెబుతున్నాను ,బల్ల గుద్ది చెబుతున్నాను. ప్రతి సీన్ మాత్రం ఎక్సలెంట్ గా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి. రేపు మీరు మా సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట చెబుతూ డిఫరెంట్ గా ఉందంటూ మీరంతా మంచి రివ్యూ కూడా ఇస్తారు అని చెప్పారు.
 

More Related Stories