English   

పోటీతో గూఢాచారికే లాభమా..?

gudhachari2
2018-07-24 15:43:43

అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి సినిమా గూఢాచారి. శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శోభిత ధూళిపాల్ల, ప్రకాష్ రాజ్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న గూడాచారి కోసం ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొత్తంగా టీజర్ తో ఆకట్టుకున్న గూడాచారి ఆగస్ట్ 3న రాబోతున్నాడు. అయితే అప్పటికి ముందు వారమే ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో గూడాచారికి పోటీ ఉండదు అనుకున్నారు. బట్.. మనోడికీ మెల్లగా కాంపిటీషన్ పెరుగుతోంది. ఆగస్ట్ 3న జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా నాచియార్ సినిమాను తెలుగులో ఝాన్సీగా విడుదల చేస్తున్నారు. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయింది. పెళ్లి తర్వాత జ్యోతిక నటించిన రెండో సినిమా ఇది. ఇందులో తను పోలీస్ఆఫీసర్ గా నటించింది. ఊరమాస్ గా ఉంటుంది జ్యోతిక పాత్ర. ఈ పాత్ర బూతులు కూడా మాట్లాడుతుందని ఆ మధ్య తమిళనాడులో విమర్శలు వచ్చాయి. అయినా అన్నీ దాటుకుని సినిమా సూపర్ హిట్ అయింది. ఈ ఝాన్సీ ఆగస్ట్ 3న గూఢాచారికి పోటీగా వస్తోంది. 

మారుతి టాకీస్ సమర్పిస్తోన్న బ్రాండ్ బాబులు కూడా ఇదే రోజు వస్తోంది. అలాగే శివకాశీపురం అనే మరో చిన్న సినిమా కూడా ఆగస్ట్ 3నే విడుదల కాబోతోంది. ఇవి అడవి శేష్ గూఢాచారికి పోటీ ఇస్తాయని చెప్పలేం. కానీ ఈ సినిమాలతో అతనికో లాభం ఉంది.. ఈ సినిమాలపై ఎలాగూ అంచానలు లేవు. ఒకవేళ ఎవరైనా చూడాలనుకున్నా.. గూఢాచారికి టాక్ బావుంటే చాలు.. ఆటోమేటిక్ గా దానికే వెళ్లిపోతారు. ఈ మూడు సినిమాల్లో ఏదీ ఆడియన్స్ ను ఆకట్టుకునేది కాదు. అలాగని అడవి శేష్ కు అదిరిపోయే ఫాలోయింగ్ ఉందని కాదు.. బట్ క్షణం సినిమాతో అతను కాస్త వెల్ నోటెడ్ అయ్యాడు. అందువల్ల ఈ మూడు సినిమాలు గూఢాచారికి లాభమే చేస్తాయని చెప్పొచ్చు. 

More Related Stories