English   

 ఏమో ప్ర‌భుదేవాను న‌మ్మి తీసుకొస్తున్నారు..

Gulaebaghavali
2018-03-17 16:48:24

ప్ర‌భుదేవా అంటే ఏ ఒక్క ఇండ‌స్ట్రీ సొత్తో కాదు. అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. న‌టుడిగా పేరు ఉంది. ఈ ఇమేజ్ ను వాడుకోడానికి ఇప్పుడు ఆయ‌న న‌టించిన సినిమాల‌ను కూడా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఆయ‌న గుళేభ‌కావ‌ళిని కూడా తెలుగులో విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాటే ఫ్లాప్ అయింది. క‌ళ్యాణ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం అక్క‌డ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. ప్ర‌భుదేవా, హ‌న్సిక న‌టించిన ఈ చిత్రం నిధి నేప‌థ్యంలో తెర‌కెక్కింది. పాత‌కాలం నాటి స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద‌గా హెల్ప్ అవ్వ‌లేదు. అయితే కామెడీ మాత్రం బాగానే పేలింది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌భుదేవాతో పాటు హ‌న్సిక కూడా తెలిసిన మొహ‌మే. దాంతో ఇద్ద‌రి క్రేజ్ ను వాడుకోడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లోనే ఇక్క‌డ విడుద‌ల చేయ‌బోతున్నారు. తాజాగా ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. ఇందులో ఓ పంచ్ డైలాగ్ కేక పెట్టించింది. ఏంట్రా ఆ పొట్ట‌లు అని ఓ విల‌న్ మ‌రో విల‌న్ ను అంటే.. ఆ నీది ఇలియానా న‌డుము మ‌రి అంటూ సెటైర్ వేస్తాడు. అది ట్రైల‌ర్ కే హైలైట్ డైలాగ్ అస‌లు. మొత్తానికి రొటీన్ గానే ఉంది ఈ గుళేభ‌కావ‌ళి. తెలుగులో అల‌రించాలంటే ఇంకా ఎక్కువే కోరుకుంటారు ప్రేక్ష‌కులు. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం కామెడీతో ఎంత‌వ‌ర‌కు నెట్టుకొస్తుందో..

More Related Stories