English   

సమంత కొడుకుగా నటించేందుకు స్టార్ హీరోల కుమారులు

Gunasekhar
2021-06-10 14:58:21

సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. ఈ సినిమాలో సామ్ కు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శకుంతల-దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ పిరియాడికల్ ప్రేమ కథను తెరకెక్కిస్తున్నారు. సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో శకుంతల కొడుకు భరత్ పాత్రలో ఎవరు నటిస్తారన్నది మొదటి నుండి ఆసక్తిగా మారింది. అయితే ఈ పాత్ర కోసం స్టార్ హీరోల కొడుకుల పేర్లు వినిపిస్తున్నాయి. గుణ శేఖర్ ఈ పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ కుమారుడు అభిరామ్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఒకవేళ అభిరామ్ కాదంటే భరత్ రామ్ ను అయినా ఒప్పించాలని ఎన్టీఆర్ ను అడుగుతారట. ఒక వేళ వాళ్ళు ఇద్దరు ఆ పాత్రలో నటించకపోతే అల్లు అర్జున్ కొడుకు ఆయాన్ ను ఆ పాత్ర కోసం సంప్రదిస్తారట. మొత్తానికి ఎవరో ఒకరు స్టార్ హీరోల కొడుకులనే గుణశేఖర్  భరత్ పాత్రలో నటింపజేయాలని చేస్తున్నారట. 

More Related Stories