English   

హన్సిక మహా తో హాఫ్ సెంచరీ

Hansika Motwani 50th Movie Title Announced
2018-08-11 22:14:38

దేశముదురుతో తెలుగు ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా సరైన బ్రేక్ రాలేదీ యాపిల్ బ్యూటీకి. దీంతో కోలీవుడ్ కు వలస వెళ్లింది. అక్కడ వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడం.. కొత్త భామల ఎంట్రీతో అమ్మడు కాస్త రేస్ లో వెనక బడింది. అయినా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉనికిని చాటుకుంటోన్న హన్సిక ఏకంగా యాభైవ సినిమా చేయబోతోంది. నిన్నమొన్నా వచ్చినట్టు కనిపిస్తోన్న ఈ భామ అప్పుడే హాఫ్ సెంచరీ కొడుతోందా అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు. అన్నట్టు కాస్త లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ సినిమా పేరు ‘‘మహా’’. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను ఒకేసారి నిర్మిస్తున్నారు. అంటే త్రిభాషా సినిమాతో హాఫ్ సెంచరీ కొట్టబోతోందన్నమాట.

కోలీవుడ్ లో హన్సిక ఫస్ట్ ఫిల్మ్ హీరో ధనుష్ చేతుల మీదుగా ఈ యాభైవ సినిమా పోస్టర్ విడుదల చేయించారు. నిజానికి ఈ నెల 9న హన్సిక బర్త్ డే. ఆ రోజే ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ కరుణానిధి చనిపోవడం వల్ల ఆ కార్యక్రమం కాస్త పోస్ట్ పోన్ చేశారు. ఇక యూఆర్ జమీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి గిబ్రన్ సంగీతం అందిస్తుండటం విశేషం. మొత్తంగా హన్సిక హాఫ్ సెంచరీయత్ మూవీ ‘మహా’ మహాగొప్ప విజయం సాధించాలని కోరుకుందాం..

More Related Stories