English   

హాఫ్ సెంచరీకి దగ్గరున్న హన్సిక

Sexiest Actress Hansika Will Announce 50th Movie on Her Birth Day
2018-08-07 07:00:53

నిన్న‌గాక మొన్న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ట్లుంది. అప్పుడే 50 సినిమాలు చేసిందా.. అస‌లు మొద‌టి సినిమా చూసిన‌పుడు ఎవ‌రైనా అనుకున్నారా.. హ‌న్సిక 50 సినిమాల మైలురాయి అందుకుంటుంద‌ని..? కానీ ఊహించ‌నిదే జ‌రిగింది. ఈ భామ ఏకంగా 49 సినిమాలు పూర్తి చేసింది. ఇప్పుడు ఆగ‌స్ట్ 9న బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న 50వ సినిమాను ప్ర‌క‌టించ‌నుంది హ‌న్సిక‌. ఈ భామ తెలుగులో దేశ‌ముదురు సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. దానికంటే ముందు బాలీవుడ్ లో ఆప్ కా స‌రూర్ అంటూ సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్ హిమేష్ ర‌షిమ్మియాతో న‌టించింది. ఆ త‌ర్వాత సౌత్ కు వ‌చ్చేసి.. ఇక్క‌డే పాగా వేసింది. తెలుగులో దేశ‌ముదురు త‌ర్వాత కంత్రి, కందిరీగ‌, ప‌వ‌ర్ లాంటి చాలా సినిమాలు చేసింది. కానీ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇక్క‌డ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది ఈ పాల‌రాతి బొమ్మ‌.

49 సినిమాలు చేసినా కూడా ఇప్ప‌టికీ మొహంలో ఎక్స్ ప్రెష‌న్స్ ప‌ల‌క‌దు. లిప్ సింక్ ఉండ‌దు.. స్క్రీన్ పై అటూ ఇటూ క‌దులుతుంటుంది అంతే. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌పుడు వ‌దిలేసుకుంది. ఇప్పుడేమో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. త‌మిళ‌నాట మాత్రం అప్పుడో ఇప్పుడో అర‌కొర సినిమాల‌తో న‌టిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే ఈ మ‌ధ్య కాస్త బ‌రువు త‌గ్గించి హాట్ హాట్ గా ద‌ర్శ‌నమిస్తుంది హ‌న్సిక‌. ఇక్క‌డ కూడా కేవ‌లం అందాల‌నే న‌మ్ముకుంటుంది ఈ పాల‌రాతి బొమ్మ‌. అందుకే క‌దా.. హ‌న్సిక‌ను పాల‌రాతి శిల్పం అన్న‌ది. న‌ట‌న‌లో సున్నా మార్కులు వేయించుకుంటూ అందంలో మాత్రం వంద మార్కులు వేయించుకుంటున్న హ‌న్సిక 50 సినిమాల మైలురాయి అందుకోవ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే.

More Related Stories