English   

హ్యాపీ బర్త్ డే హను..

Hanu-Raghavapudi

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసి.. నెక్ట్స్ మూవీతో మేటర్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు హను రాఘవపూడి.  ఇవాళ  హను రాఘవపూడి బర్త్ డే. రియలిస్టిక్, సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ను హ్యాండిల్ చేయడంలో హను రాఘవపూడి ముద్ర స్పెషల్ గా కనిపిస్తుంది. అందాల రాక్షసితో ఆకట్టుకున్న హను.. ఆ తర్వాత నానినే ఇంప్రెస్ చేశాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథ.. ఎన్నోయేళ్లుగా వస్తోన్న ప్రేమకథల్లోకెల్లా భిన్నమైనది అనిపించుకుంది. పరికివాడైన హీరో చివరి వరకూ అలాగే ఉండటం బహుశా అదే ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. ఆ స్థాయిలో కథను నమ్మే ఈ దర్శకుడు లై తో ఇబ్బంది పడ్డా ఇప్పుడు పడి పడి లేచె మనసు తో మరసారి ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

శర్వానంద్, సాయి పల్లవి జంటగా వస్తోన్న ఈ మూవీతో మరోసారి క్యూట్ లవ్ స్టోరీనే చెప్పబోతున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ కే చాలామంది ఫిదా అయిపోయారు. ఇక సినిమాతో ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. ఏదేమైనా కొందరు ప్రతి దర్శకుడికీ ఒక్కో స్ట్రెంత్ ఉంటుంది. అది దాటి ఏం చెప్పాలని ప్రయత్నించినా అది అబద్ధం(లై) అవుతుంది. ఈ విషయం చాలా త్వరగానే తెలుసుకున్నాడు కాబట్టి.. ఇకపై అలాంటి అబద్ధాల జోలికి వెళ్లకుండా ఆడియన్స్ ను ఎంతో కాలం ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ హను రాఘవపూడికి హార్ట్ ఫుల్ గా బర్త్ డే విషెస్ చెబుతోంది సినిమా పాలిటిక్స్.

More Related Stories