English   

హ్యాపీ బ‌ర్త్ డే న‌య‌న‌తార‌..

Nayanthara
2018-11-18 15:17:46

న‌య‌న‌తార‌.. ఇప్పుడు ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు కానీ.. సౌత్ ఆడియ‌న్స్ కానీ ఉండ‌రు. లేడీ సూప‌ర్ స్టార్ అనే ప‌దం వాడాలంటే ఆమెకు చాలా క్రేజ్ ఉండాలి.. స్ట్రెంత్ ఉండాలి.. ఇమేజ్ ఉండాలి. ఇవ‌న్నీ అప్ప‌ట్లో విజ‌య‌శాంతిలో క‌నిపించేవి. ఆమెకు హీరోల‌తో ప‌నిలేదు. తానే హీరోగా న‌టించి ఎన్నో సినిమాలు నిల‌బెట్టింది విజ‌య‌శాంతి. ఇప్పుడు మ‌ళ్లీ న‌య‌న‌తార‌లో అవి క‌నిపిస్తున్నాయి. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అంటారు. ఇక్క‌డ హీరోలు చెప్పిందే వేదం అంటారు. కానీ ఇలాంటి ఇండ‌స్ట్రీలో కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది న‌య‌న‌తార‌. గుర్తింపు కాదు అది.. క్రేజ్.. ఇమేజ్.. మార్కెట్.. ఇలా ఎన్ని ప‌దాలుంటే అన్ని న‌య‌న్ కోసం వాడేయొచ్చు. ఎందుకంటే హీరోల‌తో ప‌నిలేకుండా మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతుంది ఈ భామ‌.

న‌య‌న‌తార అనే పేరుకు సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న గిరాకీ మాట‌ల్లో చెప్ప‌లేం. త‌మిళ ఇండ‌స్ట్రీలో అయితే న‌య‌న బొమ్మ క‌నిపిస్తే చాలు నిర్మాత‌లు ఎగ‌బ‌డిపోతున్నారు. స్టార్ హీరోలు సినిమాలో ఉన్నా.. న‌య‌న‌తార ఇమేజ్ తోనే బొమ్మ‌లు సూప‌ర్ హిట్ అవుతున్నాయి. గ‌త కొన్నేళ్లుగా మాయ‌, తని ఒరువ‌న్, నానుం రౌడీథాన్ సినిమాలు సూప‌ర్ హిట్ట‌య్యాయి. ఇక ఇప్పుడు కూడా న‌య‌న న‌టిస్తోన్న సినిమాల్లో ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ కావ‌డం విశేషం. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన‌ ఆర‌మ్ అయినా.. హార్ర‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ఇమైక్క నోడిగ‌ల్ అయినా.. త్వ‌ర‌లోనే రాబోయే కొలైయుతుర్ కాల‌మ్ అయినా న‌య‌నతార‌ క్రేజ్ తోనే ర‌ప్ఫాడిస్తున్నాయి. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో దూసుకుపోతుంది న‌య‌న్. ఓ వైపు ఓరియెంటెడ్ సినిమాల‌తో పాటు మ‌రోవైపు సైరా, విశ్వాసం లాంటి సినిమాల్లో న‌టిస్తుంది న‌య‌న్. ఇక బిల్లా 2 ఫేమ్ చ‌క్రి తోలేటి తెర‌కెక్కిస్తోన్న కొలైయుతుర్ కాల‌మ్ హాలీవుడ్ సినిమా హ‌ష్ ఆధారంగా వ‌స్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి వ‌రస సినిమాల‌తో అంద‌నంత ఎత్తులో ఉంది న‌య‌న్. త‌న‌కు కాబోయే వాడు విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి హాయిగా త‌న లైఫ్ లీడ్ చేస్తుంది.

More Related Stories