English   

నిహారిక‌.. మెల్ల‌గా లాక్కొస్తుందిగా..!

Niharika- Happy-Wedding
2018-06-21 16:43:36

మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా నిహారిక కొణిదెల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఈమె అంత ఈజీగా స్టార్ అయిపోవ‌డం సాధ్యం అయ్యేలా లేదు. క‌నీసం త‌న ఉనికి చాటుకున్నా మేలే అన్న‌ట్లుంది ఇప్పుడు ప‌రిస్థితి. ప్ర‌స్తుతం అదే ప‌నిలో బిజీగా ఉంది నిహారిక‌. మెల్ల‌గా ఒక్కో సినిమా చేస్తూ త‌న పేరు నిల‌బెట్టుకునే ప‌నిలో ప‌డింది. మొన్న‌టి వ‌ర‌కు ఈమెకు హీరోయిన్ ఛాన్సులు ఎందుకు వ‌స్తాయి ఇలా ఉంటే అనేవాళ్లు కానీ ఇప్పుడు ఊహించ‌ని విధంగా మేకోవ‌ర్ అయింది నిహా. నిజంగా మ‌నం చూస్తున్న‌ది ఒక‌ప్పుడు చూసిన నిహారికానేనా అనే అనుమానం రాక మాన‌దు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయేలా మారిపోయింది ఈ భామ‌. ఇప్ప‌టి వ‌ర‌కు నిహారిక న‌ట‌న‌ను తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వాడుకోలేద‌నే చెప్పాలి. ఈ భామ ప్ర‌స్తుతం హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది. 

ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు రెస్పాన్స్ బాగానే వ‌చ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఈమె కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ తో త‌ను కూడా తొలి విజ‌యం అందుకుంటాన‌ని ఆశిస్తుంది నిహారిక‌. ఇక ఇప్పుడు శ్రీ‌య‌తో క‌లిసి మ‌రో సినిమాలో న‌టించ‌బోతుంది నిహారిక‌. సుజ‌న ద‌ర్శ‌క‌త్వంలో క్రిష్ కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్ నిర్మాత‌గా మారి చేస్తోన్న సినిమాలో న‌టిస్తుంది నిహారిక‌. ఈ రెండు సినిమాల‌తో నిహారిక కెరీర్ తెలుగులో ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలిక‌..!

More Related Stories