English   

 బ్రేకింగ్.. జులై 28న నిహారిక పెళ్లి..!

Happy-Wedding
2018-07-11 19:37:30

అవును.. నిహారిక అంటే మ‌రెవ‌రో కాదు.. నిహారిక కొణిదెలే. ఈమె పెళ్లి జులై 28న జ‌ర‌గ‌బోతుంది. చాలా సైలెంట్ గా అన్ని ప‌నులు పూర్తి చేసారు పెళ్లి పెద్ద‌లు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వార‌సులంతా స‌క్సెస్ అయ్యారు. త‌ను కూడా ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుంది ఈ విష‌యాన్ని. అందుకే హీరోయిన్ గా ఎలాగైనా నిల‌బ‌డాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న హ్యాపీవెడ్డింగ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధం అయింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ తో పాటు పాట‌ల‌కు కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో చిత్ర‌యూనిట్ కూడా న‌మ్మ‌కంగా ఉన్నారు ఈ చిత్రంపై. ల‌క్ష్మ‌ణ్ కార్య దీనికి ద‌ర్శ‌కుడు. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు నిహా కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ తో త‌ను కూడా తొలి విజ‌యం అందుకుంటాన‌ని ఆశిస్తుంది నిహారిక‌. ఈ సినిమాలో అల్ల‌రి పిల్ల‌గా న‌టించింది నిహారిక‌. అబ్బాయి అమ్మాయి మ‌ధ్య ఇగో క్లాషెస్ తో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే కాన్సెప్ట్ తో హ్యాపీవెడ్డింగ్ తెర‌కెక్కించాడు కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్యా. మ‌రి ఈ చిత్రంతో నిహారిక కెరీర్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories