English   

హ‌రీష్ శంక‌రా.. నీకిది త‌గునా..?

harish shankar

అవ‌కాశాలు ఎవ‌రు అడుగుతారు..? ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌చ్చిన వాళ్లు.. త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డేవాళ్లు.. అంతేకానీ ఆల్రెడీ ఇండ‌స్ట్రీలో గుర్తింపు ఉన్న‌వాళ్లు కాదు క‌దా..! నువ్వేంటో తెలిసిన‌పుడు వాళ్లే క‌దా పిలిచి అవ‌కాశం ఇవ్వాలి..? ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. గ‌బ్బ‌ర్ సింగ్ తో పాటు మ‌రో రెండు హిట్లు ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌న‌కు అవ‌కాశం ఇవ్వండి అంటూ క‌నిపించిన ప్ర‌తీ నిర్మాత.. హీరోల‌ను అడుగుతుండ‌టం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మొన్న‌టికి మొన్న తేజ్ ఐ ల‌వ్ యూ వేడుక‌లో కేఎస్ రామారావు గారికి హ‌రీష్ శంక‌ర్ అనే ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌నే సంగ‌తి గుర్తు పెట్టుకోండంటూ ఓపెన్ గానే ఆఫ‌ర్ అడిగాడు. ఇక చిరంజీవిని ఎప్ప‌ట్నుంచో అడుగుతూనే ఉన్నాడు. 

ఇప్పుడు స‌మ్మోహ‌నం ప్రీ రిలీజ్ లో కూడా నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ను ఐదేళ్లుగా త‌నతో సినిమా చేస్తానంటున్నాడు.. ఇంకా చేయ‌డం లేదు అంటూ గుర్తు చేసాడు. హీరో సుధీర్ బాబు నిర్మాత‌గా మారాడు క‌దా.. ఆయ‌న్ని కూడా ముందే అడ్వాన్స్ ఇస్తారు బాబాయ్ ద‌ర్శ‌కుల‌కు గుర్తు పెట్టుకో అంటూ అడ‌క్కుండానే ఆఫ‌ర్ అడిగేసాడు. మ‌హేశ్ బాబును సైతం మీరు ప్ర‌తీ ద‌ర్శ‌కుడి క‌థ‌లోకి ఇట్టే దూరిపోతారు.. అలాగే నా క‌థ‌లోకి కూడా దూరిపోవాల‌ని కోరుకుంటున్నాను అంటూ అక్క‌డా అడిగేసాడు. ఇలా ఏ వేడుక‌కు వ‌చ్చినా కూడా అక్క‌డున్న హీరోలు.. నిర్మాత‌ల‌ను హ‌రీష్ ఇలా అడ‌గడం ఆయ‌న్ని అభిమానించే వాళ్ల‌కు కూడా ఇబ్బందిగా ఉంది. మ‌రి ఇది ఆయ‌న వ‌ర‌కు వెళ్తుందో లేదో..? 

More Related Stories