English   

హ‌రీష్ తో హీరోల దాగుడు మూత‌లు.. 

Harish-Shankar

దాగుడు మూత‌లు అని టైటిల్ ఏ ముహూర్తంలో పెట్టుకున్నాడో తెలియ‌దు కానీ నిజంగానే హ‌రీష్ శంక‌ర్ తో దాగుడు మూత‌లు ఆడుకుంటున్నారు హీరోలు. ఈయ‌న దాగుడు మూత‌లు అనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. క‌థ రాసి కూడా చాలా కాల‌మైంది. రాసిన చాలా రోజుల‌కు నితిన్, శ‌ర్వానంద్ ల‌ను హీరోలుగా తీసుకున్నాడు కూడా. కాక‌పోతే ఇప్పుడు వాళ్లున్న బిజీకి ఈయ‌నకు ఎదురుచూపులు త‌ప్ప ఇంకేం మిగ‌ల్లేదు. డిజే లాంటి యావ‌రేజ్ సినిమా ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు వెయిటింగ్ లో ఉండ‌టం త‌ప్పేం కాదు. పైగా పాత క‌థ‌ల‌నే కొత్తగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలాంటి వాడి పారేసిన పాత క‌థ‌నే డిజేతో చెప్పాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే డిజే త‌ర్వాత దాగుడు మూత‌లు క‌థ రాసుకున్నా.. హీరోలు మాత్రం మారిపోతూ ఉన్నారు. నిజంగానే ఈ క‌థ‌తో హీరోలు కూడా దాగుడు మూత‌లు ఆడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈయ‌న‌కు ఏం  మందు పెట్టాడో తెలియ‌దు కానీ మూడేళ్లుగా పోషిస్తూనే ఉన్నాడు. 

ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన రామ‌య్యా వ‌స్తావ‌య్య ఫ్లాప్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్.. డిజే యావ‌రేజ్.. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా హ‌రీష్ కు మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడు దిల్ రాజు. ఆ మ‌ధ్య ఈ చిత్రం కోసం యుఎస్ లొకేష‌న్లు కూడా వెతికాడు హ‌రీష్ శంక‌ర్. ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ముందు నాని.. శ‌ర్వానంద్ ల‌ను అడిగినా నాని ఒప్పుకోలేదు. కానీ శ‌ర్వా స‌రే అన్నాడు. నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ లోకి వ‌చ్చి చాలా కాల‌మైంది. కాక‌పోతే ఇప్పుడు నితిన్ శ్రీ‌నివాస‌క‌ళ్యాణం సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ త‌ర్వాత ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల లైన్ లో ఉన్నాడు. ఇక‌ శ‌ర్వానంద్ కూడా సుధీర్ వ‌ర్మ‌తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాకు క‌మిట‌య్యాడు. ఈ ఇద్ద‌రి సినిమాలు పూర్త‌య్యే వ‌ర‌కు హ‌రీష్ దాగుడు మూత‌ల‌కు మోక్షం లేన‌ట్లే..!

More Related Stories