English   

దాగుడుమూత‌లే కాలేదు.. అప్పుడే సీటీమారా..?

harish shankar

ముందున్న పిట్ట‌గోడ దాట‌లేదు కానీ ప‌క్క‌నున్న పెద్ద‌గోడ దూకుతా అన్నాడంట వెన‌క‌డికి ఒక‌డు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ చేస్తున్న‌ది కూడా ఇలాగే ఉంది. ఈయ‌న డిజే త‌ర్వాత దాగుడు మూతలు సినిమా అనౌన్స్ చేసాడు. ఇది ప్ర‌క‌టించి కూడా మూడు నెల‌లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లలేదు. నితిన్, శ‌ర్వానంద్ హీరోలుగా క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌లేదు ఈ చిత్రం. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఏ అనుమానాలు అక్క‌ర్లేదు ఈ సినిమాపై. ఇక మ‌రోవైపు దాగుడుమూత‌లు ఆడ‌నే లేదు.. అప్పుడే సీటీమార్ అంటూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. టైటిల్ టెంప్టింగ్ గా ఉంద‌ని స్టోరీ కూడా రాసేసిన‌ట్లున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. డిజేలో సీటీమార్ అనే పాట ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇదే పాట‌ను టైటిల్ గా మార్చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. జ‌వాన్ సినిమాను నిర్మించిన అరుణాచ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని తెలిపాడు హ‌రీష్. నిజానికి జ‌వాన్ సినిమానే హ‌రీష్ కూడా నిర్మించాలి. కానీ అనుకోని కార‌ణాల‌తో ఆ ప్రాజెక్ట్ నుంచి మ‌నోడి ప‌క్కకెళ్లి దిల్ రాజు వ‌చ్చాడు. ఇప్పుడు ఈ బ్యాన‌ర్ లోనే సినిమా చేయ‌బోతున్నాడు. మ‌రి చూడాలిక‌.. సీటీమార్ ఎలా ఉండ బోతుందో..?

More Related Stories