English   

అల్లుడి కోసం లైన్ లో స్టార్ డైరెక్ట‌ర్..!

Kalyan-Dev

క‌ళ్యాణ్ దేవ్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంది. దానికి కార‌ణం చిరంజీవి అల్లుడు కావ‌డ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీలో ఏ హీరో వ‌చ్చినా కూడా చిరు ముందుండి అవ‌కాశాలు ఇప్పించ‌డం కానీ.. రాయ‌బారాలు చేయ‌డం కానీ చేయ‌లేదు. అలాంటి అవ‌స‌రం కూడా రాలేదు. దాదాపు అంతా త‌మ సొంత టాలెంట్ తోనే వ‌చ్చారు. మొద‌ట్లో కాస్త బూస్ట‌ప్ ఇచ్చినా.. అంతా మాస్ ఇమేజ్ సంపాదించుకుని స్టార్స్ అయ్యారు. అయితే ఇప్పుడు చిన్న‌ల్లుడి విష‌యంలో మాత్రం చిరు చొర‌వ తీసుకోక త‌ప్ప‌డం లేదు. కూతురు కోసం అల్లున్ని ముందుండి న‌డిపిస్తున్నాడు. ఇప్ప‌టికే ఇత‌డి తొలి సినిమా కోసం త‌న విజేత టైటిల్ ఇచ్చాడు చిరు. ఇక ఇప్పుడు క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. విజేత జులై 12న విడుద‌ల కానుంది. ఈ లోపు రెండో సినిమాపై కూడా క్లారిటీ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికి వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం హ‌రీష్ శంక‌ర్ ఈ కుర్ర హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్ప‌టికే మెగా కుటుంబంలో ప‌వ‌న్ తో గ‌బ్బ‌ర్ సింగ్.. బ‌న్నీతో డిజే.. సాయిధ‌రంతేజ్ తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలు చేసాడు హ‌రీష్ శంక‌ర్. ఇక ఇప్పుడు అల్లుడుతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే చిరంజీవి ప్ర‌త్యేకంగా చిన్న‌ల్లుడి కోసం క‌థ సిద్ధం చేయాల్సిందిగా హ‌రీష్ కు చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. చిరు చేస్తోన్న ఈ ప్ర‌య‌త్నాలు అల్లున్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాయో..?

More Related Stories