English   

దాగుడు మూత‌లు.. అది నిజ‌మేనా..? 

harishshakar
2018-07-15 19:23:21

కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఏళ్ల‌నాటి శ‌ని ఉంటుందేమో మ‌రి..! లేక‌పోతే మ‌రేంటి.. డిజే లాంటి క్రేజీ సినిమా ఇచ్చిన త‌ర్వాత కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీష్ శంక‌ర్ మ‌రో సినిమా చేయ‌క‌పోవ‌డం ఏంటి పిచ్చి కాక‌పోతేనూ..? ఈయ‌న ఓకే అంటే క‌నీసం చిన్న హీరోలు కూడా నో చెప్ప‌రు క‌దా.. అలాంటిది ఓ ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అది కూడా క‌థ రాసుకుని.. నిర్మాత కూడా సిద్ధంగా ఉన్న త‌ర్వాత‌..! నితిన్, శ‌ర్వానంద్ లాంటి బిజీ హీరోల‌ను న‌మ్ముకుని దాగుడు మూత‌లు ఆడ‌దాం అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఈయ‌న‌లో ఓపిక న‌శించిన‌ట్లు తెలుస్తుంది. 

వాళ్లిద్ద‌ర్ని న‌మ్ముకుంటే ప‌ని జ‌ర‌గ‌ద‌ని.. ఈ క‌థ‌లోకి మ‌రో ఇద్ద‌రు మెగా హీరోల‌ను తీసుకొస్తున్నాడు హ‌రీష్. త‌న‌కు అచ్చొచ్చిన మెగా హీరోల‌తోనే దాగుడు మూత‌లు ఆడించాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతేజ్ ల‌తో ఈ సినిమా తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. ఇదే విష‌యంపై హ‌రీష్ మాట్లాడుతూ తాను క‌న్ఫ‌ర్మ్ చేసేవ‌ర‌కు ఏదీ న‌మ్మొద్దంటున్నాడు. అదే స‌మ‌యంలో హీరోలు మారారా అంటే కాదు అనే స‌మాధానం మాత్రం చెప్ప‌ట్లేదు. అంటే మెగా కంపౌండ్ లోకి దాగుడుమూత‌లు వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. కాక‌పోతే అది ద‌ర్శ‌కుడు చెప్పేవ‌ర‌కు ఆగితే చాలు.. ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. పైగా సాయిధ‌రంతేజ్ కు హ‌రీష్ శంక‌ర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే కెరీర్ మొద‌ట్లోనే సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లాంటి సినిమా ఇచ్చాడు క‌దా..! మ‌రి ఇప్పుడు కూడా మ‌రోసారి క‌లిసి ప‌ని చేస్తారేమో చూడాలిక‌..

More Related Stories