English   

HBDVijayDevarakonda.. బర్త్ డే బాయ్ పై స్పెషల్ స్టోరీ..

vijay
2020-05-09 06:17:03

మీ అమ్మ నిన్ను నీ కోసం కన‌లేదురా.. ఈ జనం కోసం క‌న్న‌ది అంటూ చత్రపతిలో డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండని చూస్తే ఇదే అనిపిస్తుంది. గత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికైనా ఒక హిట్టు పడితే మళ్లీ ఆయన రేంజ్ జరుగుతుంది. ఈయన చేస్తున్న సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం కాదు ఇండియన్ ఆడియన్స్ కోసం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఓ సినిమాకు సైన్ చేశాడంటే అన్ని ఇండస్ట్రీల్లో ఆ సినిమా కోసం ఎదురు చూపులు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన కెరీర్ ను మార్చేసిన పెళ్లిచూపులు సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమాని కూడా షాహిద్ కపూర్ రీమేక్ చేసాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ అక్కడ కూడా ఈ చిత్రానికి దర్శకుడు. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండను యూత్ కు చేరువ చేస్తే.. ఆయన్ని కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా గీత గోవిందం. పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 70 కోట్ల షేర్ వసూలు చేసి ఈయ‌న్ని స్టార్ హీరోగా మార్చేసింది.

ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ ధడక్ ఇషాన్ క‌ట్ట‌ర్ హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. అయినా కూడా విజయ్ దేవరకొండ తన మార్కెట్ పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణతో సినిమా కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ప్లాపులు వస్తున్నా కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కచ్చితంగా పూరి సినిమాతో విజయం అనుకుంటానని ధీమాగా చెబుతున్నాడు విజయ్. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారాడు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన మిడిల్ క్లాస్ కుటుంబాలను దేవరకొండ ఫౌండేషన్ తో ఆదుకుంటున్నాడు విజయ్. హీరోగా మారిన ఐదేళ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్ దేవరకొండ.

More Related Stories