English   

ముంబై హైకోర్టులో కంగనా కు భారీ ఊరట

Kangana Ranaut
2020-11-27 16:09:17

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముంబై లోని బాంద్రాలో ఉన్న కంగన ఆఫీసును బిహ్రాన్ ముంబై కార్పొరేషన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. చట్ట పరంగా నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చేసారంటూ మండిపడింది. అంతే కాకుండా పిటీషనర్ కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇక మహారాష్ట్ర సర్కార్ పై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముంబై ని పిఓకే తో పోల్చింది. దాంతో మహా సర్కార్ ఆమె ఆఫీసు చట్ట విరుద్ధంగా నిర్మించారని కూల్చివేసింది. 

ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ కంగనా  ముంబై హైకోర్టు ను ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో కంగనా మహా సర్కార్ పై విజయం సాధించానాని ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా మహా సర్కస్ తో వివాదాల నేపథ్యంలో కంగనా తన షూటింగ్స్ అన్ని హైదరాబాద్ లోనే పూర్తిచేసుకుంటోంది. ప్రస్తుతం కంగనా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది.

More Related Stories