English   

ముద్దుల్లో మునిగిపోయిన కుమారి.. 

24-Kisses
2018-07-07 11:52:19

తొలి సినిమాతోనే ఇండ‌స్ట్రీని షేక్ చేసే ముద్దుగుమ్మ‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఆ లిస్ట్ లో కుమారి 21 ఫేమ్ హెబ్బాప‌టేల్ కూడా ఉంటుంది. ఈమె తొలి సినిమా దానికంటే ముందే చేసింది కానీ ఆ చిత్రం గురించి ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్ప‌టికీ హెబ్బా అంటే కుమారి 21 ఎఫ్ అంటారు. అంత క్రేజ్ తెచ్చుకుంది ఈ చిత్రంతో. ఆ సినిమా త‌ర్వాత కూడా ఆడో రకం ఇడో రకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల‌తో విజ‌యాలు అందుకుంది ఈ భామ‌. ఇప్పుడు మ‌రోసారి గ్లామ‌ర్ షోకు రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. కుమారిని మించిపోయేలా గ్లామ‌ర్ షో చేయ‌డానికి వ‌స్తుంది. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్ అనే సినిమాలో న‌టిస్తుంది. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రంలో 24 ముద్దు సీన్లు ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం గురించి హెబ్బా చెబుతూ.. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ లోనూ త‌న‌ది బోల్డ్ కారెక్ట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉంటుందో అర్థం అయిపోతుంది. మ‌రి ఈ స్పైసీ కారెక్ట‌ర్ అయినా హెబ్బాను ఒడ్డున ప‌డేస్తుందో లేదో చూడాలిక‌..!

More Related Stories