English   

నా.. నీ.. టివిలో హెబ్బా పటేల్.. 

hebahpatel
2018-07-13 19:30:48

యస్ మీరు చదివింది కరెక్టే.. బిగ్ బాస్ సీజన్ 2 అనుకున్నంత సక్సస్ కావడం లేదు. పైగా నాని ఫెయిల్ అయ్యాడని అంతా అంటున్నారు. ఎన్టీఆర్ ఉన్పప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు అస్సలే మాత్రం కనిపించడం లేదు. కంటెంస్టెంట్స్ నానిని చూస్తే అసలే భయపడటం లేదు సరికదా.. ఆఁ.. నానియే కదా అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు. అటు కోలీవుడ్ లో కమల్ హాసన్ కూడా చాలా సీరియస్ గా షో నడిపిస్తోంటే.. నాని నామ్ కే వాస్త్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో బిగ్ బాస్ రేటింగ్ చాలా పడిపోయింది. ఇలాగే ఉంటే ఇంకా పడిపోతుందనుకున్నారేమో.. ఈ సారి సెక్సీ బ్యూటీ హెబ్బా పటేల్ ను రంగంలోకి దించాలనుకుంటున్నారట.. 

ఈమధ్య సినిమాలు కూడా లేక ఖాళీగానే ఉంటోంది హెబ్బా పటేల్. కుమారి 21ఎఫ్ కన్నడ రీమేక్ లో మాత్రం నటిస్తోంది. అది కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టే అంటున్నారు. ఈ నేపథ్యంలో హెబ్బాను  బిగ్ బాస్ సీజన్ -2లోకి దించాలనుకుంటున్నారని వినిపిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హెబ్బాను హౌస్ లోకి పంపించబోతున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. నిజానికి హెబ్బాకు ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఈ సీజన్ కు ఖచ్చితంగా పనికొస్తుంది. ఎందుకంటే ఈ షోను మాగ్జిమం యూత్ మాత్రమే చూస్తున్నారనే మాట కూడా ఉంది. మరి నిజంగా హెబ్బా వస్తుందా..? నా.. నీ.. టివిలో కనిపిస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వేస్తే గనక.. నాని ఫెయిల్ అయ్యాడని బిగ్ బాస్ ఒప్పుకున్నట్టే అనుకోవాలేమో.. 

More Related Stories