English   

అబ్బా.. ఆ ప్రముఖ హీరోయిన్ ఈవిడా..?

Hebah-Patel

కొన్ని రోజుల క్రితం యంగ్ స్టర్ నాగ అన్వేష్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆల్రెడీ అతను రెండు సినిమాలు చేశాడు. తొలి సినిమా వినవయ్యా రామయ్యా.. ఈ సినిమా గురించి చాలామంది వినలేదు కూడా. తర్వాత ఏంజెల్ అనే సోషియో ఫాంటసీ చేశాడు. ఇది కూడా పోయింది. లేటెస్ట్ గా ఈ తరహాదే మరో సినిమా అంటూ మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు తెరకెక్కించబోతోన్న ఈ చిత్రానికి లండన్ గణేశ్ నిర్మాత. అయితే ప్రారంభం రోజున ఈ సినిమా గురించి భారీగా చెప్పారు. పుష్పకవిమానం, ఆదిత్య 369 తరహాలో ఉండే ఎక్స్ పర్మెంటల్ థ్రిల్లర్ అన్నారు. ఖర్చుకు వెనకాడం అన్నారు. అయినా నాగ అన్వేష్ పై ఖర్చు పెట్టడం అంటే ఆలోచించాల్సిన విషయమే. పోనీ కథలో దమ్మున్నా ముందు ఓపెనింగ్స్ రావాలి కదా. అవన్నీ పక్కన బెడితే ఈ మూవీ ఓపెనింగ్ రోజున ప్రెస్ నోట్ లో నాగ అన్వేష్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తుందని మాత్రం చెప్పారు. తనెవరో చెప్పలేదు. దీంతో ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరా అని ఎవరికి వారే అనుకున్నారు. కానీ ఫైనల్ ఆ బ్యూటీ ఎవరో చెప్పేశారు. ఆ పేరు విన్న తర్వాత అబ్బా.. ఈవిడా ఆ ప్రముఖ హీరోయిన్ అనుకోకుండా ఉండలేపోయారు. 

ఇంతకీ ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు.. హెబ్బా పటేల్. యస్.. కుమారి 21ఎఫ్ తో కునుకు లేకుండా చేసిన ఈ డస్కీ బ్యూటీ ఆ తర్వాత కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు చేసినా అవేవీ పెద్దగా ఆడకపోవడంతో కొన్నాళ్లుగా కనిపించడం లేదు. అంతెందుకు ఆల్రెడీ నాగ అన్వేష్ చేసిన ఏంజెల్ లో  ఏంజెల్ కూడా ఈవిడే. మరి ఆల్రెడీ నాగ అన్వేష్ తో చేసిన హీరోయిన్ ప్రకటించడానికి కూడా వీరెందుకింత బిల్డప్ మెయిన్టేన్ చేశారో కానీ.. ఇన్ని రోజులు ఎవరై ఉంటారా అనుకున్న వారికి హెబ్బా అని చెప్పి అబ్బా.. అనిపించారు. నిజానికి ఏంజెల్ తర్వాత హెబ్బాకి ఇంత వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.. ఇందుకు కారణాలేమనుకుందో కానీ, ఖాళీ టైమ్ ను ఒంట్లో కొవ్వు కరిగించేందుకు ఉపయోగిస్తోంది. మరి స్లిమ్ జాజిలా మారి వస్తోన్న ఈ భామకు మళ్లీ అవకాశాలొస్తాయా?

More Related Stories