English   

హాట్ హాట్ కుమారి..

hebha patel new look
2018-06-05 08:30:52

ఇప్పుడు హెబ్బాప‌టేల్ ను చూస్తే ఎవ‌రైనా ఇదే అంటారు. కుమారి 21 ఎఫ్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ దానికి ముందే ఓ సినిమా చేసింది కానీ అది ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కుమారి త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ లేదు ఈ భామ‌కు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా హిట్టైనా కూడా అందులో నందితా శ్వేతా క్రెడిట్ అంతా ప‌ట్టుకుపోయింది. మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది పెద్దగా క్లిక్ అవ్వ‌లేదు. వ‌రుణ్ తేజ్ లాంటి క్రేజీ హీరోల‌తో న‌టించినా హెబ్బాకు ఒరిగిందేమీ లేదు. పైగా అమ్మాయిగారు ఆంటీలా మారిపోయారు ఈ మ‌ధ్య‌. భ‌యంక‌రంగా బ‌రువు పెరిగిపోవ‌డంతో హెబ్బాకు అవ‌కాశాలే రావ‌ట్లేదు. దాంతో ఫిజిక్ పై బాగా సీరియ‌స్ గా దృష్టి పెట్టింది ఈ కుమారి. దీనికి ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తుంది. గ‌తంతో పోలిస్తే చాలా బ‌రువు త‌గ్గిపోయింది ఈ భామ‌. పైగా అందాలు ఆర‌బోస్తూ తాజాగా ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా హెబ్బాకు మ‌ళ్లీ అవ‌కాశాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌. ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories