English   

హలోగురూ.. మొదలైంది...

Ram-Trinathrao
2018-03-13 14:23:11

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతోన్న కొత్త సినిమా హలో గురూ ప్రేమకోసమే షూటింగ్ ప్రారంభమైంది. దిల్ రాజు నిర్మాణంలో, త్రినాథరావు నక్కిన నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ మేరకు ప్రకాష్ రాజ్, రామ్ పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. టైటిల్ ను బట్టి ఇదో మంచి ప్రేమకథ అని అర్థమౌతోన్నా రామ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఎనర్జిటిక్ పవర్ ప్యాక్డ్ గానూ ఉంటుందని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చేస్తోన్న తొలి సినిమా ఇదే. అనుపమ పరమేశ్వరన్ తో రెండో సినిమా. రీసెంట్ గా ఉన్నది ఒకటే జిందగీలో రామ్ తో రొమాన్స్ చేసింది అనుపమ. 

ప్రస్తుతం రామ్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఈ ఐదేళ్లలో అతను సాలిడ్ హిట్ అనదగ్గ సినిమా నేను శైలజ మాత్రమే. మరోవైపు ఈ ఐదేళ్లలో చాలామంది కొత్త కుర్రాళ్లొచ్చారు. హిట్లు కొడుతున్నారు. అలాగే అతనితో కెరీర్ మొదలుపెట్టిన వాళ్లు కూడా కొత్త రూట్ లో వెళుతూ సరికొత్త విజయాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ హైపర్ యాక్టింగ్ చూపించకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చూపితేనే రామ్ కు హిట్. అయితే ఇది దిల్ రాజు బ్యానర్ కాబట్టి ఖచ్చితంగా కథకు సరెండర్ కావాల్సిందే. ఇక త్రినాథరావు నక్కిన, దిల్ రాజు కాంబోలోలాస్ట్ ఇయర్ నాని హీరోగా వచ్చిన నేను లోకల్ మంచి హిట్ అయింది. ఆ నమ్మకంతోనే మళ్లీ త్రినాథరావుకు చాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. మరి ఈ క్రేజీ కాంబో అయినా రామ్ కు హిట్ ఇస్తుందా..?

More Related Stories