English   

దిల్ రాజు అండతో రెచ్చిపోతోన్న రామ్ 

Ram
2018-07-12 04:11:02

దసరా.. టాలీవుడ్ లో మరో పెద్ద సీజన్. అందుకే ఈ సీజన్ లో పెద్ద స్టార్స్ మాత్రమే ఎక్కువగా పోటీ పడుతుంటారు. వారి మధ్య చిన్న స్టార్స్ వస్తే రిస్క్ లేదా కాన్పిడెన్స్ అనుకోవడమే. అఫ్ కోర్స్ ఒక్కోసారి టాప్ స్టార్స్ కంటే స్మాల్ స్టార్సే ఎక్కువ హిట్లుకొడుతుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ దసరా బరిలో పోటీకి నిలిచారు. ఇదెంత టఫ్ ఫైట్ అనేది వేరే చెప్పక్కర్లేదు. ఆ ఇద్దరి మధ్య మరో స్టార్ రావడాన్ని ఎక్స్ పెక్ట్ చేయం. కానీ రామ్ వస్తున్నాడు. అసలే ఈ ఐదారేళ్లలో నేను శైలజ తప్ప హిట్ లేని రామ్ ఇంత ధైర్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతని వెనక దిల్ రాజు ఉన్నాడు. యస్.. దిల్ రాజు వల్లే రామ్ అంత పెద్ద స్టార్స్ తో పోటీకి నిలవబోతున్నాడు. రామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమే’ అనే సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరయిన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్. అయినా మళ్లీ ఆ బ్యూటీనే రిపీట్ చేస్తున్నారు. ఇక అతి చిన్న స్టార్స్ తో మొదలుపెట్టి దిల్ రాజు మెప్పించి అతని బ్యానర్ లోనే మూడో సినిమా చేస్తున్న నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకుడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చేసిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నెక్ట్స్ డే దసరా. అంటే అప్పటికే ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ వచ్చి ఉంటారు. అయినా వీరితో ఢీ అంటున్నాడు. మరి ఈ టాప్ స్టార్స్ తో ఫైట్ కు రెడీ అయిన రామ్ వీరిని ఢీ కొంటాడా లేక పాత రిజల్ట్ ను ఫేస్ చేస్తాడా అనేది చూడాలి.

More Related Stories