English   

పందెంకోడి ప్ర‌భావం ఎంత‌..? 

Hello-Guru-Prema-Kosame
2018-10-16 11:38:23

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు త‌మిళ్ సినిమాల‌కు అంత డిమాండ్ ఏం లేదు. అక్క‌డి సినిమాలు ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం ఆపేసి కూడా చాలా రోజులు అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే ర‌జినీకాంత్ సినిమాలు కూడా చూడ‌టం మానేసారు. అయితే ఇప్పుడు విశాల్ మాత్రం నేనున్నాను అంటూ వ‌స్తున్నాడు. ఈయ‌న న‌టించిన పందెంకోడి 2 అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. తెలుగులో కూడా ప్ర‌మోష‌న్ బాగానే చేసుకుంటున్నాడు. తెలుగులోనే ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు కూడా. ఇదిలా ఉంటే అదే రోజు హ‌లో గురు ప్రేమకోస‌మే వ‌స్తుంది. త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్లు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ చిత్ర పాట‌ల‌కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  నేనులోక‌ల్ త‌ర‌హాలోనే మ‌రోసారి పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తుంది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పందెంకోడి 2 పోటీ ప‌డుతుంది. ఈ రెండు సినిమాలు అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానున్నాయి. మ‌రోవైపు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర‌వింద స‌మేత అరాచ‌కం కూడా జ‌రుగుతుంది. ఈ చిత్రం ఊచ‌కోత కోస్తుంది. ఇప్ప‌టికే 70 కోట్ల షేర్ దాటేసాడు వీర‌రాఘ‌వుడు. ఈయ‌న ధాటిని త‌ట్టుకుని అటు విశాల్.. ఇటు రామ్ నిల‌బ‌డాలి. లేదంటే త‌న క‌త్తి ప‌దునుకు ఇద్ద‌ర్ని బ‌లిస్తాడు వీర రాఘ‌వ‌రెడ్డి. పందెంకోడితోనే తెలుగులో విశాల్ కు గుర్తింపు వ‌చ్చింది.. ఆ సినిమాకు సీక్వెల్ కావ‌డం.. కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డంతో పందెంకోడి 2పై ఇక్క‌డ కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఒకేసారి ఇద్ద‌రు క్రేజీ హీరోలు వ‌స్తే అది ఇద్ద‌రికీ స‌మ‌స్యే. కానీ ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ఈ వార్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories