English   

ఈ కుర్ర హీరోకి ఆడవాళ్లుంటే అంతే

hero raj tharun movie failures with lady directors
2018-06-04 07:25:27

రాజ్ తరుణ్ కు ఓ సెంటిమెంట్ మొదలైంది. అతనికి ఆడవాళ్లతో కుదరడం లేదు. వాళ్లు కానీ ఉన్నారా.. ఇంక ఆ సినిమా అంతే. అయినా ఆడవాళ్లు లేకుండా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా..? ఆడవాళ్లంటే సినిమాలో ఉండేవాళ్లు కాదులెండి.. సినిమా తీసేవాళ్లు. అవును. మనోడు లేడీ డైరెక్టర్స్ ను బానే ఎంకరేజ్ చేస్తున్నా.. వాళ్లు మాత్రం ఇతని నమ్మకాల్ని నిలబెట్టడం లేదు. అందుకే అతని సినిమాలు వరుసగా పోతున్నాయి. లేడీస్ కదా.. ఏదో సెన్సిటివ్ స్టోరీస్ చేస్తారనుకున్నాడేమో.. కానీ వాళ్లు మాత్రం మాగ్జిమం ఫ్లాపులే ఇస్తున్నారు. 

రాజ్ తరుణ్ రీసెంట్ మూవీ రంగుల రాట్నం సినిమాకు డైరెక్టరే లేడీనే. ఆమె పేరు శ్రీ రంజని.. ఫస్ట్ హఫ్ లో చాలా హింస పెడుతుందీ సినిమాలో. సెకండ్ హాఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. సరైన ఎండింగ్ లేక రంగుల రాట్నం రాజ్ తరుణ్ కు కళ్లు తిరిగేలా చేసింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన రాజుగాడుకు కూడా మహిళా దర్శకురాలే. పేరు సంజనా రెడ్డి. రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసిందీ అమ్మాయి. అలాగే మారుతి చెప్పిన పాయింట్ తో రాజ్ తరుణ్ ను ఒప్పించి. క్లెఫ్టో మేనియా అనే వింత జబ్బుతో బాధపడే కుర్రాడిగా తన హీరోను ఫన్నీగా ప్రజెంట్ చేద్దామనుకుంది. కానీ ఆ పాయింట్ తప్ప కథ, కథనాలన్నీ అత్యంత ఓల్డ్ గా ఉండటంతో రాజుగాడిని భరించలేం అన్నారు ఆడియన్స్. దీంతో ఈ సెకండ్ లేడీ సినిమా కూడా పోయింది. మొత్తంగా మహిళా దర్శకులతో రాజ్ తరుణ్ చేస్తోన్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. మరి ఇక ముందు లేడీ డైరెక్టర్స్ తో పనిచేస్తాడా లేదా అనేది చూడాలి. 

More Related Stories