English   

పూర్తయిన శర్వా సర్జరీ...రెండు నెలల బెడ్ రెస్ట్

sharwand
2019-06-17 20:01:07

ప్రస్తుతం శర్వానంద్ 96 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమిళ్ మాతృక తెరకెక్కించిన ప్రేమ్‌ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌ లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి మంచి మంచి ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వానంద్ రెండు రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌ లో కూడా నాలుగు సార్లు క్రిందకు సురక్షితంగానే చేరుకున్నారు. ఐదో సారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాలి ఎక్కువగా రావడంతో కాళ్లపై ల్యాండ్ కావాల్సివుండగా భుజాలతో నేలమీదకు దిగారు. దీంతో షోల్డర్‌లో ఫ్రాక్చర్ అయింది. ఈ సంఘటన తర్వాత శర్వానంద్ వెంటనే హైదరాబాద్‌ సన్ షైన్ ఆసుపత్రిలో జాయిన్ కాగా ఆయనకు ఈరోజు సర్జరీ చేశారు. ఈ సర్జరీ సుమారు పదకొండు గంటల పాటు జరిగిందట, సర్జరీ విజయవంతంగా పూర్తయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఆయనకు రెండు నెలలు బెడ్ రెస్ట్ కూడా వైద్యులు సూచించారని అంటున్నారు.

More Related Stories