English   

ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో సిధ్దార్థ్.. బంపర్ ఆఫర్

sid
2020-01-24 05:24:30

ఒకప్పుడు కోలీవుడ్ హీరో సిధ్దార్థ్ వరుసగా అవకాశాలు అందుకున్నాడు. ఫ్యామిలీ చిత్రాలతో ఆడియెన్స్ చాలా దగ్గరయ్యాడు సిద్దు. అయితే కొంతకాలంగా సిద్దు చాలా వెనకపడిపోయాడు. ప్రస్తుతం హీరోగా అరకొర సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. దాంతో కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడుకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న.. ఇండియన్-2 చిత్రంలో సిద్దార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మూవీలోను సిద్దార్థ్ బంఫర్ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం. రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీలో సిద్దార్థ్ కు ఛాన్స్ వచ్చినట్టు కోలీవుడ్ వర్గాలంటున్నాయి.

దర్బార్ తర్వాత తలైవా.. శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే ఓ ముఖ్య పాత్ర కోసం సిద్దార్థ్ ను ఎంచుకున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటి కే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఒకేసారి కమల్, రజనీ లాంటి స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ రావడంతో.. సిధ్దార్ధ్ మళ్లీ బిజీగా మారడం ఖాయమంటున్నారు. మరి సిద్దుకి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.

 

More Related Stories