English   

ఒక సూర్యుడు ఉద‌యించిన వేళ‌..!!

ngk
2018-07-24 15:36:43

ఒక్క ఫ్లాప్ వ‌చ్చినా.. ప‌ది ఫ్లాపులు వ‌చ్చినా స్టార్ హీరోకు వ‌చ్చే న‌ష్ట‌మేమీ ఉండ‌దు. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు సూర్య విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న‌కు కొన్నేళ్లుగా ఫ్లాప్ త‌ప్ప హిట్ లేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లే చాప చుట్టేస్తుంది. కానీ సూర్య కోసం ద‌ర్శ‌కుల క్యూ మాత్రం త‌గ్గ‌ట్లేదు. ఒక‌టి రెండు కాదు.. సూర్య కోసం ఏకంగా ఏడు సినిమాలు.. ఏడుగురు ద‌ర్శ‌కులు వేచి చూస్తున్నారిప్పుడు. ఈయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌స్తుతం న‌టిస్తున్న ఎన్జీకే సెకండ్ లుక్ విడుద‌ల చేసారు. సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ర‌కుల్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంతో పాటు ఇప్ప‌టికే కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లు పెట్టాడు. లండ‌న్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. మోహ‌న్ లాల్ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అల్లు శిరీష్ న‌టించాల్సి ఉన్నా.. డేట్స్ క్లాష్ కార‌ణంగా బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఈ రెండు సినిమాల‌తో ప‌టు హ‌రి.. విక్ర‌మ్ కే కుమార్.. సుధ కొంగ‌ర లాంటి ద‌ర్శ‌కులు కూడా సూర్య కోసం క‌థ‌లు ప‌ట్టుకుని సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు ఉద‌యించిన వేళ అంటూ అన్నీ కొత్త క‌థ‌ల‌తోనే వ‌స్తున్నారు ద‌ర్శ‌కులు. ఈయ‌న కూడా వాళ్ల క‌థ‌లు ఫైనల్ చేసి.. మీరు క్యూ లో ఉన్నారు అంటున్నాడు. మొత్తానికి ఈయ‌న దూకుడు చూసి హిట్స్ లో ఉన్న హీరోల‌కు కూడా షాకులు త‌ప్ప‌ట్లేదు.
 

More Related Stories