English   

నట సింగం 

suriya
2018-07-23 16:47:00

సూర్య.. తమిళ నటుడైనా దక్షిణాదిలోని ప్రతి భాషలోనూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్. ఇవాళ ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ బర్త్ డే. ఈ సందర్భంగా అతని కెరీర్ ను ఓ సారి చూద్దాం.. 

సూర్య తండ్రి శికుమార్ నటుడు. ఆయన ద్వారా ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చాడు సూర్య అనుకుంటే పొరబాటే.. కాదు.. చిన్నతనం నుంచీ ఎన్నో కష్టాలు చూసేలా చేశాడు తండ్రి శివకుమార్. అవును.. తను స్టార్ కాబట్టి తన పిల్లలు కూడా ఆ స్టార్డమ్ తో పెరగాలనుకోలేదాయన. అందుకే సాధారణ పిల్లల్లాగానే సూర్యను పెంచాడు. కార్లున్నా.. స్కూల్ కు బస్ లోనే పంపించాడు. కాలేజ్ కు వచ్చిన తర్వాత కూడా మాగ్జిమం బస్సుల్లోనే సూర్య ప్రయాణం చేసేవాడు. తర్వాత కొన్నాళ్లు ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫీస్ లో వర్కర్ గా చేశాడు. 

సూర్య తొలి జీతం ఎంతో తెలుసా.. 750రూపాయలు. నమ్మలేకపోతున్నారు కదూ.. యస్.. అంత గ్రౌండ్ లెవెల్ నుంచి లైఫ్ చూశాడు కాబట్టే సూర్య ఎప్పుడూ కూల్ గా ఉంటాడు. తనకు లైఫ్ అంటే ఏంటో బాగా తెలుసు కాబట్టే ఇతరుల కోసం ఎంతో సాయం చేస్తుంటాడు. ఇక నటుడుగా ప్రయాణం గురించి మాట్లాడితే.. ఎంట్రీ కూడా ఏమంత ఈజీగా దక్కలేదు. 

1997లో నెరుక్కునేర్(ముఖాముఖి) అనే సినిమాతో విజయ్ తో కలిసి మల్టీస్టారర్ తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇది ఆడలేదు. ఆ తర్వాత మూడేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసినా ఏదీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. 1999లో జ్యోతికతో పూవెల్లమ్ కెట్టప్పార్ అనే సినిమా చేశాడు. ఇదే వారి తొలి సినిమా. ఇప్పుడు ఆ ఇద్దరూ భార్యభర్తలుగా మారతారని అప్పుడు ఊహించారో లేదో కానీ.. ఈ సినిమా కూడా ఆడలేదు. మొత్తంగా బాలా దర్శకత్వంలో వచ్చిన నందా సూర్యకు తొలి కమర్షియల్ హిట్. అప్పటి వరకూ ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. మల్టీస్టారర్స్ చేశాడు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలూ చేశాడు. 

మొత్తంగా ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్ల తర్వాత అతనికి వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాక్కకాక్క. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో ఘర్షణగా రీమేక్ అయింది. ఈ సినిమాతో సూర్యకు స్టార్డమ్ మొదలైందనే చెప్పొచ్చు. కాక్కకాక్క తర్వాత పితామగన్(శివపుత్రుడు)లో  చేసిన పాత్ర తిరుగులేని గుర్తింపు తెచ్చింది. ఇదే క్రమంలో పేరళగన్(సుందరాంగుడు) సినిమాతో హ్యాండికాప్  నటించి శెభాష్ అనిపించుకున్నాడు. 

ఇవన్నీ హీరోగా అతనికి ఓ గుర్తింపును తెచ్చిన సినిమాలు. 2003లో వచ్చిన గజిని సూర్యకు ఓ రేంజ్ లో స్టార్డమ్ తెచ్చింది. దీంతో ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. గజినితో తెలుగులో మార్కెట్ మొదలైంది. అంతేకాదు.. ఇక్కడ అతనికి అభిమానులు పెరిగారు. అటు దక్షిణాదిలో కూడా గజిని ఇంపాక్ట్ అద్భుతంగా పడింది. సూర్య ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనేది ఎంటైర్ సౌత్ కు తెలిసిపోయింది. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసిన ఆమిర్ ఖాన్ సైతం తనకు సూర్య నటనే ఇష్టం అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని టాలెంట్.

ఇక గజినీ తర్వాత సూర్య అలా దూసుకుపోయాడు. వరుస సినిమాలు, విజయాలతో టాప్ లీగ్ లోకి ఎంటర్ అయిపోయాడు. యాక్షన్ సినిమాలు చేస్తూనే యాక్టింగ్ కు ఆస్కారం ఉన్న పాత్రలను వదల్లేదు. ఇదే టైమ్ లో కొన్ని ప్రయోగాలూ చేశాడు. కాక్కకాక్క తర్వాత గౌతమ్ మీనన్ తో చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో అతని పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. పాత్ర కోసం అతనెంత శ్రద్ధ తీసుకుంటాడో తెలియజేస్తుంది. ఈ సినిమాలో 16యేళ్ల కుర్రాడిగా చేశాడు.65యేళ్ల వృద్ధుడిగానూ మెప్పించాడు. అలాగే యంగ్ స్టర్ గా ఆకట్టుకుంటాడు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో మూడు భిన్నమైన ఫిజికల్ అప్పీరియన్స్ తో కనిపించడం మామూలు విషయం కాదు.. 

ఇక 2010నుంచి సూర్య కోలీవుడ్ కు సింగంలా మారాడు. హరి డైరెక్షన్ లో మొదలైన సింగం సిరీస్ లో ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేశాడు. ఈ మూడూ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్సే. ఇదే టైమ్ లో ఇవి తప్ప ఇతర సినిమాలూ కాస్త ఇబ్బంది పెట్టాయి. రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఎన్జీకే(నంద గోపాల కృష్ణన్) అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మరో సినిమా లైన్ లో ఉంది. 

అటు సోషల్ సర్వీస్ లోనూ అగరం అనే ఫౌండేషన్ తో ఎందరికో సేవలు చేస్తున్నాడు. ఈ ఫౌండేషన్ కోసం రీసెంట్ గా కోట్ల విలువ చేసే తన ఇంటిని కూడా రాసిచ్చాడు. అంతటి గొప్ప మనసు సూర్యది. సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో టాప్ ప్లేస్ లో ఉండే పేరు సూర్య. సౌత్ ఫస్ట్ వంద కోట్లు కలెక్ట్ చేసిన హీరో కూడా అతనే. మూడు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ సాధించిన సూర్య.. ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ ఈ టాలెంటెడ్ స్టార్ కు మరోసారి హ్యాపీ బర్త్ డే చెబుతోంది ‘సినిమా పాలిటిక్స్’.. 

More Related Stories